భార్య గొంతు కోసి భర్త పరార్

Published : Sep 17, 2018, 12:11 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
భార్య గొంతు కోసి భర్త పరార్

సారాంశం

భార్యను హత్య చేసి.. తమ నాలుగు నెలల చిన్నారిని ఇంట్లోనే వదిలేసి అతను పరారయ్యాడు.

హైదరాబాద్ నగరంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురయ్యింది. కట్టుకున్న భర్తే.. ఆమెను గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

సిరాజ్ అహ్మద్(27), హసీనా బేగమ్(19) దంపతులు జూబ్లీహిల్స్ లోని వెంటగిరి ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరికి నాలుగు నెలల చిన్నారి కూడా ఉంది. కాగా.. ఆదివారం తెల్లవారు జామున హసీనా హత్యకు గురయ్యింది. ఆమె భర్త సిరాజ్ ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యను హత్య చేసి.. తమ నాలుగు నెలల చిన్నారిని ఇంట్లోనే వదిలేసి అతను పరారయ్యాడు.

కాగా.. హత్య కు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. హసీనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న సిరాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌