చంద్రబాబు అరెస్ట్ వారెంట్ రద్దు చేయండి.. గవర్నర్‌కు టీటీడీపీ లేఖ

By Arun Kumar PFirst Published Sep 17, 2018, 12:03 PM IST
Highlights

నిబంధనలకు విరుద్ధంగా బాబ్లీ ప్రాజెక్ట్‌ను సందర్శించిన కేసులో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే

నిబంధనలకు విరుద్ధంగా బాబ్లీ ప్రాజెక్ట్‌ను సందర్శించిన కేసులో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు... దీని వెనుక రాజకీయ కుట్ర వుందని ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో టీటీడీపీ నేతలు గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. బాబ్లీ వల్ల ఉత్తర తెలంగాణ ఎడారి కాబోతోందని నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం బాబ్లీని నిలిపివేయాలని పోరాటం చేసిందని.. బాబ్లీ సందర్శనకు అనుమతి లేదంటూ టీడీపీ నేతలను అరెస్ట్ చేసి.. 5 రోజుల పాటు నిర్బంధించింది.

ఎలాంటి కేసులు లేవని చెప్పి ప్రత్యేక విమానంలో మహారాష్ట్ర ప్రభుత్వమే వారందరినీ హైదరాబాద్‌ తరలించారని లేఖలో పేర్కొన్నారు. నాడు ఎలాంటి కేసులు లేవని చెప్పి.. మళ్లీ నేడు కోర్టులో హాజరు కావాలంటూ వారెంట్ జారీ చేయడం వెనుక రాజకీయ కుట్ర వుందని తాము భావిస్తున్నామని... మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి చంద్రబాబుతో సహా ఇతర నాయకులపై జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేయాలని, కేసులు ఎత్తివేయాలని టీటీడీపీ లేఖలో పేర్కొంది.

click me!