బాత్రూంకు వెడతానని చెప్పి.. పోలీసుల కస్టడీలో ఉరివేసుకున్న నిందితుడు !

By AN TeluguFirst Published Oct 9, 2021, 9:22 AM IST
Highlights

యజమాని ఖాతా నుండి రూ .7 లక్షలు స్వాహా చేశాడనే ఆరోపణలపై రమేష్ రెడ్డి అనే వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అతను శుక్రవారం నాంపల్లి లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్ : హైదరాబాద్ లో కస్టోడియల్ డెత్ కలకలం రేపుతోంది. రాజస్థాన్ పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు హైదరాబాద్ లోని ఓ లాడ్జ్ బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెడితే.. 

యజమాని ఖాతా నుండి రూ .7 లక్షలు స్వాహా చేశాడనే ఆరోపణలపై రమేష్ రెడ్డి అనే వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అతను శుక్రవారం నాంపల్లి లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు నాంపల్లి పోలీసులు వివరాలు చెబుతూ.. రమేష్ రెడ్డి (40) బాత్రూమ్ కు వెళ్లాలని చెప్పి పోలీసుల అనుమతి తీసుకుని, బాత్రూంలోకి వెళ్లి బాత్రూమ్ షవర్ రాడ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని.. తెలిపారు. 

రమేష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి గురువారం ఉదయం, రాజస్థాన్ నుండి ఒక అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లు హైదరాబాద్ వచ్చారు. వీరు  స్థానిక మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ లోని పోలీసులు సాయంతో రూ .7 లక్షలు మోసం చేసిన కేసులో రమేష్‌ను అరెస్టు చేశారు.

రాత్రి 7.30 గంటల సమయంలో, పోలీసులు రమేశ్ రెడ్డిని నాంపల్లిలోని ఓ లాడ్జికి తీసుకువచ్చారు. కానీ జైలు ట్రాన్సిట్ వారెంట్ తీసుకోలేదు. దీనికి గాను అతడిని సంబంధిత స్థానిక కోర్టు ముందు హాజరుపరచలేదు.

హుస్సేన్ సాగర్ చుట్టూ నైట్ బజార్.. !

అయితే, రమేశ్ రెడ్డికి ముగ్గురు పోలీసులు రాత్రంతా కాపలాగా ఉన్నారని అధికారులు తెలిపారు. “శుక్రవారం ఉదయం 5.30 గంటలకు, ASI నిద్రలేచి వాష్‌రూమ్‌కు వెళ్లివచ్చాడు. ఆ తరువాత, రమేష్ కూడా వాష్‌రూమ్ వెళతానని పోలీసులను అడిగాడు. 

అలా వెళ్లిన రమేష్ రెడ్డి వాష్‌రూమ్‌ను లోపలి నుండి లాక్ చేసాడు. అయితే, ఎంతసేపటికి అతను బయటకు రాకపోవడంతో, పోలీసులు బలవంతంగా తలుపులు తెరిచారు. అక్కడ, నిందితుడు ఉరి వేసుకుని కనిపించాడు "అని జాయింట్ పోలీస్ కమిషనర్ (సెంట్రల్ జోన్) విశ్వ ప్రసాద్ చెప్పారు.
తర్వాత నాంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బాత్రూం నుండి బయటకు తీశారు. "custodial deathకింద కేసు నమోదు చేయబడింది, జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కూడా అప్రమత్తమయ్యారు" అని ఒక సీనియర్ అధికారి చెప్పారు.

click me!