కరోనా దెబ్బ: నిన్న జనరల్ బజార్, నేడు బేగం బజార్ మూసివేత

By narsimha lode  |  First Published Jun 25, 2020, 6:17 PM IST

రోజు రోజుకు హైద్రాబాద్, సికింద్రాబాద్ పరిధిలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు సికింద్రాబాద్ జనరల్ బజార్ మూసివేశారు. తాజాగా ఈ నెల 28వ తేదీ నుండి బేగంబజార్ ను మూసివేయాలని హైద్రాబాద్ కిరాణ వ్యాపారుల అసోసియేషన్ నిర్ణయం తీసుకొంది.



హైదరాబాద్: .రోజు రోజుకు హైద్రాబాద్, సికింద్రాబాద్ పరిధిలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు సికింద్రాబాద్ జనరల్ బజార్ మూసివేశారు. తాజాగా ఈ నెల 28వ తేదీ నుండి బేగంబజార్ ను మూసివేయాలని హైద్రాబాద్ కిరాణ వ్యాపారుల అసోసియేషన్ నిర్ణయం తీసుకొంది.

బుధవారం నాటికి తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 10,444కి చేరుకొంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదౌతున్నాయి.జీహెచ్ఎంసీలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ  ప్రతి రోజూ కరోనా కేసులు ఎక్కువగానే నమోదౌతున్నాయి.

Latest Videos

undefined

ఐదో విడత లాక్ డౌన్  లో భాగంగా  పలు రంగాలపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో ఎక్కువగా కరోనా కేసులు నమోదౌతున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

హైద్రాబాద్, సికింద్రాబాద్ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంపై బేగం బజార్ ను మూసివేయాలని హైద్రాబాద్ కిరాణ వ్యాపారుల అసోసియేషన్ నిర్ణయించింది. 

ఈ నెల 28వ తేదీ నుండి వారం రోజుల పాటు బేగం బజార్ ను మూసివేయాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకొంది. ఆంక్షలు ఎత్తివేసిన నాటి నుండి కరోనా కేసులు పెరిగిపోవడంపై వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు.
 

click me!