కల్నల్ సంతోష్ బాబు విగ్రహం రెడీ

Published : Jun 25, 2020, 05:49 PM IST
కల్నల్ సంతోష్ బాబు విగ్రహం రెడీ

సారాంశం

చైనా దురాగతానికి బలైన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో ప్రతిష్ఠిస్తామని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

చైనా దురాగతానికి బలైన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో ప్రతిష్ఠిస్తామని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

సూర్యాపేటలోని పాత బస్టాండ్ సెంటర్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా తెలియవస్తుంది. సంతోష్ బాబు విగ్రహాన్నీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శిల్పులు తయారుచేస్తున్నారు. విగ్రహం దాదాపుగా పూర్తయింది. దానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. 

ఇకపోతే.... సోమవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబసభ్యులను పరామర్శించారు. సంతోషికి డిప్యూటీ కలెక్టర్ నియామకపత్రాలను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.ఎప్పుడు ఏ సహాయం చేయాలన్నా చేస్తామని కూడ సీఎం హామీ ఇచ్చారన్నారు.  

తమ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చినట్టుగా తెలిపారు. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా తన వద్దకు రావాలని కూడ సూచించారన్నారు.

వీలు చూసుకొని తన ఇంటికి భోజనానికి రావాలని సీఎం కేసీఆర్ కోరారని ఆమె తెలిపింది.తమ కుటుంబానికి ఇచ్చిన హామీని అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తమ కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని సంతోష్ బాబు తల్లి చెప్పారు.మీ అబ్బాయిని తీసుకురాలేకపోయినా... చేతనైనంత సహాయం చేస్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారన్నారు.

ఇదిలా ఉంటే సూర్యాపేటలో ఏదో ఒక చౌరస్తాకు సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేయనున్నట్టుగా మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. అంతేకాదు సూర్యాపేటలో సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే