కొలువుదీరిన ఖైరతాబాద్ గణపయ్య.. ఆన్ లైన్ లో దర్శనాలు

Published : Aug 22, 2020, 01:27 PM ISTUpdated : Aug 22, 2020, 01:42 PM IST
కొలువుదీరిన ఖైరతాబాద్ గణపయ్య.. ఆన్ లైన్ లో దర్శనాలు

సారాంశం

కరోనా కారణంగా వేడుకలను నిరాడంబరంగా జరుపుతున్నారు. కోవిడ్‌ నిబంధనలు నేపథ్యంలో వేలాదిగా ఒకేసారి తరలివచ్చే భక్తులను కట్టడిచేసేందుకు ఆన్‌లైన్లో మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.

ఖైరతాబాద్ గణనాథుడు కొలువుదీరాడు. ఈ సంవత్సరం ధన్వంతరీ నారాయణ మహాగనపతిగా కొలువుదీరారు. కాగా... గణపయ్యకి పద్మశాలి సంఘం వారు కండువ, గరకమాల, జంజెం, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ లోని తాపేశ్వరానికి చెందిన సురిచి ఫుడ్స్ వారు ప్రత్యేకంగా తయారు చేసిన 100 కిలోల లడ్డూ ప్రసాదం గణపతి చేతిలో అమర్చారు.

స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ దంపతులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని తొలి పూజ నిర్వహించారు. పది కిలోల వెండిని గణపతికి బహుకరించారు. గతంలో కంటే విభిన్నంగా తొమ్మిది అడుగుల మట్టితో గణపతిని ప్రతిష్టించారు. కరోనా కారణంగా వేడుకలను నిరాడంబరంగా జరుపుతున్నారు. కోవిడ్‌ నిబంధనలు నేపథ్యంలో వేలాదిగా ఒకేసారి తరలివచ్చే భక్తులను కట్టడిచేసేందుకు ఆన్‌లైన్లో మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. భక్తులను గుంపులుగా పోలీసులు అనుమతించడం లేదు. 

ప్రతి ఏటా... ఖైరతాబాద్ గణపయ్యని చూసేందుకు భక్తులు తరలివచ్చేవారు. అయితే.. ఈసారి కరోనా నేపథ్యంలో.. అందుకు వీలు లేకుండా పోయింది. అయితే.. భక్తులు నిరాశ చెందకుండా ఉండేందుకు.. ఆన్ లైన్ లో దర్శన అవకాశం కల్పిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?