శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత... రేవంత్ రెడ్డి అరెస్ట్

Published : Aug 22, 2020, 11:50 AM ISTUpdated : Aug 22, 2020, 11:59 AM IST
శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత... రేవంత్ రెడ్డి అరెస్ట్

సారాంశం

పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు-కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.  

తెలంగాణ కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో నిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, మల్లు రవి బయలు దేరారు. కాగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు-కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఇదిలా ఉంటే శ్రీశైలం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్ష నేతలకు లేదా!? సంఘటన వెనుక వాస్తవాలను తెలుసుకునేందుకు వెళుతుంటే కేసీఆర్‌కు అంత భయమెందుకు!? దిండి వద్ద ఖాకీల పహారా పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి!?’ అని సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయారు. పలువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అరకోటి నష్టపరిహారం ప్రకటించింది.
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?