ఉప్పల్ టీడీపీ అభ్యర్ధి వీరేందర్ గౌడ్‌‌కు ఐటీ దాడుల సెగ

By narsimha lodeFirst Published Nov 15, 2018, 11:42 AM IST
Highlights

హైద్రాబాద్‌లోని రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డీఎస్‌ఏ బిల్డర్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ,శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలపై గురువారం నాడు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: హైద్రాబాద్‌లోని రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డీఎస్‌ఏ బిల్డర్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ,శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలపై గురువారం నాడు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

రవి ఫుడ్స్  డైరెక్టర్లు రవీందర్ కుమార్ అగర్వాల్, రాజేంద్రకుమార్ అగర్వాల్, కేదర్నాథ్ అగర్వాల్ ఇండ్లపై సోదాలు చేస్తున్నారు. శాంతాశ్రీరామ్ ఎండీ మడ్డి నర్సయ్య ఇంట్లో కూడ సోదాలు జరుగుతున్నాయి.  మడ్డి నర్సయ్య ఓ టీఆర్ఎస్ అగ్రనేతకు ముఖ్య అనుచరుడుగా చెబుతున్నారు.

రవి ఫుడ్స్‌లో టీడీపీ సీనియర్  నేత దేవేందర్‌గౌడ్ తనయులు ముగ్గురు ప్రమోటర్స్ గా ఉన్నారని  ప్రచారం సాగుతోంది.  రవి ఫుడ్స్  ప్రమోటర్స్ గా ఉన్నవారే డీఎస్ఏ బిల్డర్స్, ప్రమోటర్స్ గా ఉన్నారు. రవిఫుడ్స్ 1500  కోట్ల టర్నోవర్ ఉంది.  ఇందులో రూ.400 కోట్లు ఎగుమతుల ద్వారా వస్తోందని  అంచనా.అయితే రవి ఫుడ్స్ కంపెనీ నుండి దేవేందర్ గౌడ్  తనయులు తప్పుకొన్నారని సమాచారం

కాటేదాన్ ప్రాంతంలో  రవి ఫుడ్స్ ఏర్పాటైంది. ఇటీవలనే కొత్తూరులో  కొత్త ఫ్లాంట్ ను ఏర్పాటు చేశారు.2014 ఎన్నికల్లో తూళ్ల వీరేందర్ గౌడ్ చేవేళ్ల నుండి  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఆ సమయంలో  వీరేందర్ గౌడ్ సమర్పించిన అఫిడవిట్‌లో తనకు రూ.720 కోట్ల ఆస్తులు ఉన్నాయని  ప్రకటించారు.
 

click me!