హెడ్ కానిస్టేబుల్ గా భార్య, ఆనందంతో ఈ భర్త ఏం చేశాడో తెలుసా?

Published : Jul 22, 2023, 10:36 AM ISTUpdated : Jul 22, 2023, 10:56 AM IST
 హెడ్ కానిస్టేబుల్ గా భార్య, ఆనందంతో ఈ భర్త ఏం చేశాడో తెలుసా?

సారాంశం

హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే ముందు, ఆమె 45 రోజుల శిక్షణ పొందవలసి వచ్చింది, దాని కోసం ఆమె తన 18 నెలల బిడ్డను, కుటుంబాన్ని విడిచిపెట్టింది

భార్యభర్తల మధ్య ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు. వారి మధ్య గౌరవం కూడా ఉండాలి. నమ్మకం ఉండాలి. ఇవి మాత్రమే కాదు, చాలా మంది భార్యలు తమ భర్త ఉన్నత స్థానానికి వెళితే సంతోషిస్తారు. కానీ, అదే భార్య గొప్ప స్థానానికి వెళ్తుంటే చాలా మంది భర్తలు ఓర్చుకోలేరు. ఇప్పటికీ ఆడది అంటే కేవలం వంటింటిలో ఉండాల్సిన వస్తువులా చూసేవారు కూడా లేకపోలేదు. అయితే,  ఓ వ్యక్తి మాత్రం భార్య మంచి ఉద్యోగం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తాడు. అంతేకాదు, బ్యాండ్ , బాజాలతో గ్రాండ్ వెల్ కమ్ చెప్పాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ నగరానికి చెందిన రోనాల్డ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య దీనా కు ఇటీవల ఉద్యోగం వచ్చింది. ఆమె ఇటీవల కానిస్టేబుల్ గా పదోన్నతి పొందింది. హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే ముందు, ఆమె 45 రోజుల శిక్షణ పొందవలసి వచ్చింది, దాని కోసం ఆమె తన 18 నెలల బిడ్డను, కుటుంబాన్ని విడిచిపెట్టింది.

కాగా, ఆమె ప్రమోషన్ సాదాసీదా గా ఉండకూడదని ఆమె భర్త భావించాడు. ఆమెకు బాజా,భజంత్రీలు, క్రాకర్లతో ఘన స్వాగతం పలికాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఓ వైపు నగరంలో వర్షాలు బాగా కురుస్తున్నప్పటికీ, వాటిని ఆయన లెక్క చేయకుండా ఆమెకు గ్రాండ్ వెల్ కమ్ ఏర్పాట్లు చేయడం విశేషం.

భార్యపై అతను చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. శుక్రవారం దీనా తన ఇంటికి వచ్చినప్పుడు, డప్పు దరువులు, క్రాకర్లు, ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు నృత్యాలతో ఆమెకు స్వాగతం పలికారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఇప్పటికే మిలియన్ వ్యూస్‌ను తాకింది.

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?