కాళ్లు చేతులు కట్టేసి కారులోనే హత్య: హేమంత్ మర్డర్ కేసుపై పోలీసులు

By narsimha lodeFirst Published Sep 25, 2020, 5:46 PM IST
Highlights

కారులోనే ఊపిరాడకుండా చేసి హేమంత్ ను హత్య చేశారని చందానగర్ పోలీసులు ప్రకటించారు. శుక్రవారం నాడు చందానగర్ పోలీసులు  పరువు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్పారు


హైదరాబాద్: కారులోనే ఊపిరాడకుండా చేసి హేమంత్ ను హత్య చేశారని చందానగర్ పోలీసులు ప్రకటించారు. శుక్రవారం నాడు చందానగర్ పోలీసులు  పరువు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్పారు. 

ఈ నెల 20వ తేదీన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఇంట్లో హేమంత్  హత్యకు స్కెచ్ వేశారని పోలీసులు చెప్పారు. హేమంత్ ను చంపించే బాధ్యతను లక్ష్మారెడ్డి తన బావమరిది  యుగంధర్ రెడ్డికి  అప్పగించారని పోలీసులు తెలిపారు.

also read:చందానగర్ పరువు హత్య: హేమంత్ ను చంపేందుకు రూ. 10 లక్షల సుఫారీ

యుగంధర్ రెడ్డికి  చందానగర్ కు ఈ ప్రాంతం అంతా పరిచయం చేశారు.  దీంతో ఆయన ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషకు, బిచ్చూ యాదవ్ లతో  హేమంత్ ను హత్య చేసేందుకు రూ. 10 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొన్నారని పోలీసులు చెప్పారు. 

ఈ నెల 20వ తేదీన యుగంధర్ రెడ్డికి అవంతి తండ్రి సుఫారీకి అడ్వాన్స్ గా  లక్ష రూపాయాలు ఇచ్చినట్టుగా పోలీసులు తెలిపారు.హత్య చేసిన తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తామని యుగంధర్ రెడ్డి కిరాయి హంతకులకు ఇస్తామని ఒప్పుకొన్నాడని పోలీసులు చెప్పారు.

చందానగర్ నుండి హేమంత్ ను తీసుకొని జహీరాబాద్ కు తీసుకెళ్లారని చెప్పారు. జహీరాబాద్ లోని వైన్స్ షాపు వద్ద మద్యం బాటిల్స్, పక్కనే ఉన్న జనరల్ స్టోర్స్ లో  దారం  కొనుగోలు చేసినట్టుగా పోలీసులు చెప్పారు.

జహీరాబాద్  నుండి ముందుకు వెళ్లే సమయంలో మూత్ర విసర్జనకు దిగిన హేమంత్ కాళ్లు , చేతులు  కట్టేసి కారులో కూర్చొబెట్టారని  పోలీసులు తెలిపారు.కారులోనే హేమంత్ ను ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని సంగారెడ్డికి సమీపంలో వేశారని పోలీసులు  చెప్పారు

click me!