హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ, రచనారెడ్డి వాదనతో...

First Published Jul 6, 2018, 4:53 PM IST
Highlights

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 7 పై హైకోర్టు స్టే విధించింది. దీంతో ప్రొపెషన్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా అడ్మిషన్లకు బ్రేక్ పడింది.

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 7 పై హైకోర్టు స్టే విధించింది. దీంతో ప్రొపెషన్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా అడ్మిషన్లకు బ్రేక్ పడింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రొపెషన్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ల కోసం గత నెల 21న జీవో నెంబర్ 7 ను జారీ చేసింది. అయితే దీని వల్ల క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందంటూ నీలేరాయ్, కాలేశ్రయ్ అనే అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

జీవో 7 పై దాఖలైన పిటిషన్ పై ఇవాళ కోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున ప్రముఖ న్యాయవాది రచనా రెడ్డి వాదించారు. మెడికల్, ఇంజనీరింగ్,అగ్రికల్చర్ వంటి వృత్తివిద్యా కోర్సుల్లో స్పోర్ట్స్ కోటాను రద్దు చేయాలని ఆమె కోర్టును కోరింది. దీని వల్ల అనేక అక్రమాలు జరుగుతున్నట్లు ఆమె తెలిపింది. ఇందుకోసం ఇటీవల వెలుగుచూసిన ఓ ఉదంతాన్ని రచనా రెడ్డి కోర్టుకు వివరించారు.

ఈమె వాదనతో ఏకీభవించిన కోర్టు జీవో నెంబర్ 7 పై స్టే విధిస్తూ రామసుబ్రమణ్యం బెంచ్ తీర్పు ఇచ్చింది.  ఏడాది పాటు ప్రొఫెషనల్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటాను పరిగణలోకి తీసుకోరాదని ప్రభుత్వానికి సూచించింది.  
 

click me!