Knight frank wealth report: భాగ్య "వంతుల" న‌గ‌రం.. ఆ జాబితాలో ముంబయి తర్వాత హైదరాబాదే

Published : Mar 03, 2022, 12:13 AM ISTUpdated : Mar 03, 2022, 12:15 AM IST
Knight frank wealth report:  భాగ్య "వంతుల" న‌గ‌రం.. ఆ జాబితాలో ముంబయి తర్వాత హైదరాబాదే

సారాంశం

Knight frank wealth report:  తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్ అరుదైన ఘ‌న‌త ల‌భించింది. దేశంలో  అత్యంత ధనికులు అధికంగా ఉన్న న‌గ‌రాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని 'నైట్‌ ఫ్రాంక్‌ వెల్త్‌ రిపోర్ట్‌- (Knight frank wealth report 2022) వెల్లడించింది.   

Knight frank wealth report:  తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్ అత్యంత‌ అరుదైన ఘ‌న‌త ల‌భించింది. దేశంలో అత్యంత ధనికులు అధికంగా ఉన్న న‌గ‌రాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని 'నైట్‌ ఫ్రాంక్‌ వెల్త్ నివేదిక‌(Knight frank wealth report 2022) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలపై COVID-19 మహమ్మారి ప్రభావం చూపుతున్నప్పటికీ.. ప్రపంచంలోనే అత్యధిక  బిలియనీర్లు ఉంటున్న జాబితాలో భారతదేశం మూడవ స్థానంలో ఉంద‌ని నైట్ ఫ్రాంక్ - వెల్త్ రిపోర్ట్ 2022 ప్ర‌క‌టించింది.

ఈ నివేదిక ప్రకారం అత్యంత ధనికులు(బిలియనీర్లు) ఉంటున్న నగరాల్లో ముంబయి ప్రథమస్థానంలో ఉండ‌గా.. హైదరాబాద్ రెండవ స్థానంలో, బెంగళూరు మూడవ స్థానంలో ఉంది. ఈ నివేదిక ప్ర‌కారం.. నికర ఆస్తి విలువ 30 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.227 కోట్లు) కంటే ఎక్కువగా ఉన్న వారిని 'అత్యంత ధనికులు' గా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. నైట్ ఫ్రాంక్, వెల్త్ రిపోర్ట్ 2022 ప్రకారం. భారతదేశంలో అత్యంత ధనికుల సంఖ్య 2021లో 11% YY (సంవత్సరానికి) పెరిగింది, వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 39 శాతానికి పెరుగుతుంద‌ని అంచనా. 

అత్యంత ధనికులున్న నగరాల్లో ముంబాయి 1596 మందితో తొలి స్థానంలో నిలువ‌గా.. హైదరాబాద్ 467మందితో సెకండ్‌ ప్లేస్ ను దక్కించుకుంది. అ త‌రువాత బెంగళూరు 352 , ఢిల్లీ లో 315, చెన్నై లో 264 మంది అత్యంత ధ‌నికులు ఉన్నట్టు నివేదించింది. 2026 నాటికి హైదరాబాద్‌లో అత్యంత ధనవంతుల సంఖ్య 728కి పెరుగుతుందని అంచనా వేసింది. ఐదేళ్లలో హైదరాబాద్‌లో అత్యంత ధనికుల సంఖ్య 48.7శాతం పెరిగినట్లు నివేదిక‌ తెలిపింది. అంటే, ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌లో 314మంది భాగ్యవంతులు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 467కి పెరిగింది.  

దేశవ్యాప్తంగా చూస్తే .. ఒక్క ఏడాదిలోనే 11శాతం వృద్ధి నమోదైంది. 2020లో 12, 287మంది బిలియనీర్స్‌ ఉంటే,  ఆ సంఖ్య‌ 2021లో 13, 637కి పెరిగింది. రాబోయే ఐదేండ్లలో భారతదేశంలో అత్యంత ధనికుల సంఖ్య 19,006  పెరుగుతుందని అంచనా వేసింది. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్ర‌కారం.. రాబోయే ఐదు సంవత్సరాలలో..  ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనికుల జనాభా 28%కు  పెరుగుతుందని అంచనా వేసింది, ఆసియా, ఆస్ట్రేలియాల్లో 33 శాతం వృద్ధి ఉంటుందని తెలిపింది. తర్వాత ఉత్తర అమెరికా 28%, లాటిన్ అమెరికా 26% పెరుగుతుందని అంచనా వేయింది.
 
అత్య‌ధిక ధ‌న‌వంతుల లేదా బిలియనీర్ జనాభాలో పెరుగుదలతో, దేశాభివృద్ది అత్యంత వేగంగా వృద్ది కావ‌డానికి దోహ‌ద‌ప‌డుతోంద‌ని, దేశం ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని, వివిధ రంగాలలో సూపర్ పవర్‌గా ఎదుగుతుందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ భావిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !