
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వివరాలను సైబరాబాద్ పోలీసులు మీడియాతో పంచుకున్నారు. ఫరూఖ్, హైదర్ అలీలు సుచిత్ర దగ్గర లాడ్జీలో వున్నారని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ (cyberabad police commissioner) స్టీఫెన్ రవీంద్ర (stephen ravindra) తెలిపారు. ఫిబ్రవరి 25న సాయంత్రం ఫారుఖ్, హైదర్ అలీని నాగరాజు సహా కొందరు వ్యక్తులు చంపేందుకు వెంబడించారని సీపీ చెప్పారు. అయితే ఫారుఖ్, హైదర్ అలీలు తప్పించుకుని పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. గత నెల 26న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని.. వీరిని విచారించగా యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ పేర్లు బయటకొచ్చాయని సీపీ వెల్లడించారు.
రాఘవేందర్ రాజు సహా మరికొందరు హత్యకు కుట్ర చేశారని నాగరాజు పేర్కొన్నారు. రాఘవేందర్ రాజు మున్నూరు రవి, మధుసూదన్ రాజు ఢిల్లీలో వున్నట్లు తేలిందని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. వీరి లోకేషన్ ట్రేస్ చేయగా... మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో వున్నట్లు తేలిందని సీపీ చెప్పారు. వీరిని ఢిల్లీలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ తీసుకొచ్చామని రవీంద్ర పేర్కొన్నారు. రాఘవేందర్ రాజు, మున్నూరు రవి, మధుసూదన్ రాజులు మహబూబ్‌నగర్ నుంచి వైజాగ్ వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారని సీపీ చెప్పారు. వీరికి జితేందర్ రెడ్డి డ్రైవర్ పీఏ రాజు షెల్టర్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.
రాఘవేందర్ రాజు నుంచి పిస్టల్ సీజ్ చేశామని.. రాఘవేందర్ రాజును ప్రశ్నించగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేసినట్లు తెలిసిందని సీపీ పేర్కొన్నారు. రాఘవేందర్ రాజు మొదట ఫారూఖ్‌తో కాంటాక్ట్ అయ్యాడని.. మంత్రిని హత్య చేస్తే రూ.15 కోట్లు ఇస్తానని ఆఫర్ చేశాడని రవీంద్ర తెలిపారు. రాఘవేందర్ రాజు , మధుసూదన్ రాజులు ప్రధాన ఫైనాన్షియర్లని.. కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరిస్తామని ఆయన చెప్పారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి (jithender reddy), డీకే అరుణ (dk aruna) పాత్రపై విచారిస్తున్నామన్నారు. రాఘవేందర్ రాజు యూపీ నుంచి గన్ తెప్పించాడని, అరెస్ట్‌కు భయపడే వీరు ఢిల్లీలో ఆశ్రయం పొందారని రవీంద్ర పేర్కొన్నారు. నాగరాజు, ఫారుఖ్ స్టేట్‌మెంట్ల ఆధారంగా ఈ కుట్ర బయటపడిందని కమీషనర్ పేర్కొన్నారు.
కాగా.. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (srinivas goud) హత్యకు కుట్ర జరిగిందన్న వార్తలతో తెలుగు ప్రజలు ఉలిక్కిపడ్డారు. నలుగురు వ్యక్తులు ఆయనను చంపేందుకు సుపారీ ఇచ్చి మరి చంపించేందుకు ప్రయత్నించారు. ఈ కుట్రను భగ్నం చేసిన సైబరాబాద్ పోలీసులు.. (cyberabad police commissioner) నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌లు ఫారుఖ్ అనే వ్యక్తితో మంత్రిని హత్య చేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 12 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫారుఖ్ పోలీసులకు సమాచారం అందించడంతో హత్య కుట్ర బయటపడింది.