Prathyusha Garimella : ఇంటర్నెట్ లో వెతికి.. 10 రోజుల ముందే ఆత్మహత్య ప్రణాళిక.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు...

By SumaBala Bukka  |  First Published Jun 13, 2022, 7:59 AM IST

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య దర్యాప్తులో కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఆత్మహత్యచేసుకోవాలని పది రోజుల ముందునుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. 


హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ Prathyusha Garimella(36)  ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై బంజారాహిల్స్ పోలీసుల దర్యాప్తులో కొత్తకోణాలు వెలుగుచూశాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న Suicide noteఆమే రాసినట్టుగా అంచనాకు వచ్చారు. dead body వద్ద లభించిన కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. కొద్దికాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి అనుభవిస్తున్న ఆమెకు బయటపడే మార్గం కనిపించడం లేదని భావిస్తున్నారు.

తరచూ స్నేహితులు, సన్నిహితులతో జీవితంపై నిరాశను వ్యక్తం చేసేదని..  తాను మానసిక ఘర్షణకు గురవుతుంది అనే విషయాన్ని వారు పసిగట్టలేకపోయారు అని తెలుసుకున్నారు. తాను కోరుకున్న జీవితాన్ని ఆస్వాదించలేక పోతున్నాననే అంతర్మథనంతో బలవన్మరణానికి సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నెట్ లో వెతికినట్లు భావిస్తున్నారు. బొటిక్ కాపలాదారులను అదుపులోకి తీసుకుని కొన్ని వివరాలు రాబట్టారు.

Latest Videos

undefined

ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్యపై తండ్రి ఫిర్యాదు .. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు : పోలీసులు

 నొప్పి తెలియకుండా చనిపోవాలని…
‘ఏమాత్రం నొప్పి తెలియకుండా సునాయాసంగా మరణించాలనే‘ ఉద్దేశంతో ప్రత్యూష ఇంటర్నెట్లో వెతికినట్లు సమాచారం. ముందుగానే మానసికంగా సిద్ధమైన ఆమె పది రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రణాళిక తయారు చేసుకున్నారు. ఇంటి వద్ద అయితే కుటుంబ సభ్యులు ఉంటారనే ఉద్దేశంతో బొటిక్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. వారం క్రితం కార్పెంటర్ ను పిలిచి బాత్ రూమ్ లోని కిటికీలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రాంతాన్ని మూసివేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  దీనికి పాస్ వర్డ్ ఉండడంతో సాంకేతిక నిపుణుల సహాయంతో ఒకటి రెండు రోజుల్లో తెరిచి పరిశీలిస్తామని బంజారాహిల్స్ సీఐ నాగేశ్వరరావు తెలిపారు.

ఎన్ని సార్లు  తలుపు కొట్టినా…
ప్రత్యూష బొటిక్ కాపలాదారులుగా రెండు నెలల క్రితం వీరబాబు, దుర్గా దంపతులు పనిలో చేరారు. వీరికోసం boutique ఉండే బిల్డింగ్ కింది భాగంలో ప్రత్యూష ఒక గదిని కేటాయించింది. శుక్రవారం ఉదయం 10, 11 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చిన ఆమె రెండుసార్లు బయటకు వెళ్లింది. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చింది. తాను కిరాణా దుకాణానికి వెళ్తున్నానని ప్రత్యూషకు దుర్గా చెప్పగా.. పని ఉంటే తానే పిలుస్తాను అని… లోపలికి రావొద్దంటూ సూచించింది. ఉదయం తలుపు తీయకపోవడంతో రెండు సార్లు గట్టిగా తలుపు కొట్టినా తీయలేదని, 12 గంటల ప్రాంతంలో ప్రత్యూష తండ్రి, డ్రైవర్ వచ్చారని వీరబాబు, దుర్గ ఇప్పటికే పోలీసులకు తెలిపారు.

ఉపాసన దిగ్భ్రాంతి...
ప్రత్యూష ఆత్మహత్యపై పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నసినీ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన తనతో ఆమెకు ఉన్న అనుబంధాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్న… ‘నా బెస్టీ, నా బెస్ట్ ఫ్రెండ్  మరణంతో షాక్ కు గురయ్యాను. నాకు చాలా మంచి స్నేహితురాలు, చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి పోయింది. అన్ని విషయాల్లో చాలా గొప్పగా ఆలోచించేదని, ఇలా అనుకోకుండా ఒత్తిడికి గురవడం బాధాకరమని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్నారు. 

click me!