బ్రేకింగ్: కేసీఆర్‌తో ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ

Siva Kodati |  
Published : Jun 12, 2022, 06:34 PM ISTUpdated : Jun 12, 2022, 06:41 PM IST
బ్రేకింగ్: కేసీఆర్‌తో ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు దృష్టి  పెట్టిన నేపథ్యంలో ఉండవల్లితో భేటీ కావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో (kcr) మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (vundavalli arun kumar) భేటీ అయ్యారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు దృష్టి  పెట్టిన నేపథ్యంలో ఉండవల్లితో భేటీ కావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. 

కాగా.. కొత్త జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు కెసిఆర్ శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. భారత్ రాష్ట్రీయ సమితి (bharat rashtriya samiti) పేరు వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లు, త్వరలోనే ఈ పేరును రిజిస్టర్ చేయించనున్నట్లు తెలిసింది. కొత్త పార్టీని ఈనెలాఖరులో కెసిఆర్ ఢిల్లీలో ప్రకటించే వీలుంది. కారు గుర్తును సైతం అడిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త జాతీయ ప్రత్యామ్నాయం, రాష్ట్రపతి ఎన్నికలు, శాసనసభ వర్షాకాల సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి శుక్రవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో చూచాయగా టిఆర్ఎస్ గురించి కెసిఆర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ నెల 19న జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. 

మంత్రులు సైతం కేసీఆర్ అభిప్రాయంతో ఏకీభవించినట్లు తెలిసింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత తాను ముఖ్యమంత్రిగానే ఉంటూ దేశం కోసం పని చేస్తానని సీఎం చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ మాదిరి హైదరాబాద్ ఇకపై జాతీయ రాజకీయాలను అడ్డాగా మారుతుందని ఆయన అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టిఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించే ప్రతిపాదన వచ్చినా.. అలా కాకుండా కొత్త పార్టీని స్థాపించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కొత్త పార్టీకి జై భారత్, నయా భారత్, భారత రాష్ట్రీయ తనిఖీ తదితర పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.

పేరు, జెండా తదితర అంశాలపై మంత్రుల అభిప్రాయాలను సిఎం కోరినట్లు సమాచారం. మరో పక్క తమిళనాడు,  బెంగాల్లో తరహాలో తెలంగాణలోనూ గవర్నర్ను విశ్వవిద్యాలయాల కులపతి పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో ముఖ్యమంత్రికి అధికారాలు అప్పగించేందుకు అవసరమైన కార్యాచరణపై మాట్లాడినట్లు తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!