హైదరాబాదులో డాక్టర్ కిడ్నాప్: చెక్ పెట్టిన అనంతపురం పోలీసులు

Published : Oct 28, 2020, 08:31 AM ISTUpdated : Oct 28, 2020, 09:01 AM IST
హైదరాబాదులో డాక్టర్ కిడ్నాప్: చెక్ పెట్టిన అనంతపురం పోలీసులు

సారాంశం

హైదరాబాదులో వైద్యుడిని కిడ్నాప్ చేసిన దుండగులకు అనంతపురం పోలీసులు చెక్ పెట్టారు. వైద్యుడిని కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకుని వెళ్తుండగా అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

అనంతపురం: హైదరాబాదులో కిడ్నాపైన వైద్యుడిని అనంతపురం జిల్లా పోలీసులు రక్షించారు. వైద్యుడిని కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకుని వెళ్తుండగా అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాదులోని హిమాయత్ సాగర్ దర్గా సమీపంలో డాక్టర్ బెహజాట్ హుస్సేన్ ను దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. 

పక్కా పథకం ప్రకారం బుర్కాలు వేసుకుని వైద్యుడిని అతని కారులోనే కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లారు. ఈ సంఘటన మంగళవారంనాడు చోటు చేసుకుంది. అయితే, పక్కా సమాచారంతో అనంతపురం జిల్లా పోలీసులు కారును గుర్తించారు. 

ఇద్దరు కిడ్నాపర్లు ప్రస్తుతం అనంతపురం జిల్లా రాప్తాడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు పారిపోయినట్లు సమాచారం. వైద్యుడి కిడ్నాప్ సమాచారం నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్పీ అన్ని చెక్ పోస్టులను అప్రమత్తం చేశారు. 

కిడ్నాప్ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

PREV
click me!

Recommended Stories

Heat Wave Alert : అసలుసిసలైన ఎండలు షురూ.. ఈ జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలు, ఎల్లో అలర్ట్
పేమెంట్ అయిన‌ట్లు సౌండ్ వ‌స్తుంది కానీ డ‌బ్బులు ప‌డ‌వు.. ఫోన్‌పేలో కొత్త స్కామ్‌. జాగ్ర‌త్త‌!