హైదరాబాద్: రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ నే బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు, ఆరులక్షలు హాంఫట్

By Arun Kumar PFirst Published Sep 21, 2021, 9:38 AM IST
Highlights

నలుగురికీ సైబర్ నేరాల గురించి చెప్పి అవగాహన కల్పించే ఓ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ నే బురిడీ కొట్టించి భారీగా నగదు దోచేశారు సైబర్ కేటుగాళ్ళు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  

హైదరాబాద్: సైబర్ నేరాల గురించి ఇతరులకు అవగాహన కల్పించే బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగే సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పనిచేసి రిటైరయిన శివరామకృష్ణ శాస్త్రి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఆరు లక్షల రూపాయలు కోల్పోయాడు.  

ఈ సైబర్ నేరానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్బీఐ బ్యాంకులో మేనేజర్ గా పనిచేసి రిటైరయిన శివరామకృష్ణ హైదరాబాద్ లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన ఇంటి కరెంట్ బిల్లును ఆన్ లైన్ ద్వారా చెల్లించాడు. అయితే విద్యుత్ బిల్లు చెల్లింపు అప్ డేట్ కాలేదంటూ ఆయనకు సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేశారు. మీరు ఈ యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చని  చెప్పి  టీఎస్ ఎస్పీడీసీఎల్,  క్విక్ సపోర్ట్ యాప్స్ లింకులను అతడి మొబైల్ కు పంపించారు.  

read more  న్యూడ్‌గా కనిపిస్తా.. ‘‘ కాల్ మీ ఎనీ టైం ’’ అంటూ వలపు వల, రూ. 24 లక్షలు టోకరా

కేటుగాళ్ల మాటలు నిజమని నమ్మిన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ విద్యుత్ బిల్లు అప్ డేట్ చేసుకో కోసమంటూ పంపిన లింక్ పై క్లిక్ చేశాడు. క్విక్ సపోర్ట్ యాప్ ఓపెన్ చేసి డెబిట్ కార్డ్ వివరాలు నమోదుచేశాడు. ఇంకేముంది సైబర్ కేటుగాళ్లు అతడి బ్యాంక్ ఖాతాలో నుండి పది నిమిషాల్లోనే పలు విడతలుగా రూ.5.80లక్షలు కాజేశారు.

తన అకౌంట్ నుండి భారీగా నగదు మాయం కావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు శివరామకృష్ణ సిటీ సైబర్ క్రైమ్ ను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

click me!