సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆక్యుపంక్చర్ హీలింగ్ సెంటర్.. ప్రారంభించిన ఎస్వీకే సెక్రెటరీ ఎస్ వినయ కుమార్

Published : Dec 13, 2022, 08:07 PM IST
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆక్యుపంక్చర్ హీలింగ్ సెంటర్.. ప్రారంభించిన ఎస్వీకే సెక్రెటరీ ఎస్ వినయ కుమార్

సారాంశం

హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆక్యుపంక్చర్ హీలింగ్ సెంటర్‌ను ఎస్వీకే సెక్రెటరీ ఎస్ వినయ కుమార్ మంగళవారం ప్రారంభించారు. సైడ్ ఎఫెక్ట్స్, ఔషధాలు లేని ఈ వైద్య సేవలు వినియోగించుకోవాలని అన్నారు. ధరలు అందుబాటులో ఉంచి వైద్య సేవలు అందరికీ చేరేలా కృషి చేయాలని ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సంపాదకులు కే రామచంద్రమూర్తి అన్నారు.  

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆక్యుపంక్చర్ హీలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఎస్వీకే సెక్రెటరీ ఎస్ వినయ కుమార్ మంగళవారం దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సంపాదకులు కే రామచంద్రమూర్తి హాజరయ్యారు.

ఆక్యుపంక్చర్ హీలింగ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఎస్ వినయ కుమార్ మాట్లాడుతూ, ఔషధాలు, సైడ్ ఎఫెక్ట్‌లు లేని ఆక్యుపంక్చర్ విధానాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర కమిటీ సభ్యులు జీ బుచ్చి రెడ్డి మాట్లాడుతూ, ఈ ఆక్యుపంక్చర్ హీలింగ్ సెంటర్ ప్రజలకు మంచి వైద్య సేవలు అందిస్తుందని ఆశించారు. అనుభవజ్ఞుడైన హీలర్ కాపర్తి జనార్దన్ ఈ హీలింగ్ సెంటర్‌లో సమర్థవంతంగా సేవలు అందిస్తారని ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ సంపాదకులు కే రామచంద్రమూర్తి భరోసా ఇచ్చారు. ఈ వైద్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. ఇందుకోసం అందుబాటులో ఉండే ధరలనే నిర్ణయించాలని, తద్వార అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యం కోసం కృషి చేయాలని కోరారు.

Also Read: ఆగస్ట్ 1న భార్యా బాధితుల సంఘం సమావేశం.. ప్రభుత్వానికి తెలిపేలా...

ఆక్యుపంక్చర్ హీలింగ్ సెంటర్ సోమవారం మినహా అన్ని వారాలు అందుబాటులో ఉంటుందని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజర్ ఆర్ వి రమణారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ హీలింగ్ సెంటర్ తెరిచి ఉంటుందని వివరించారు. 

ఆక్యుపంక్చర్ హీలింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెట్రో చానల్ అభినేత దేవరకొండ కాళిదాస్, తెలంగాణ సాహిత కార్యదర్శి ఆనదాచారి, టి బ్రహ్మచారి, హెచ్ఆర్ నారాయణ రావు, హీలర్స్ సుమలత తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu