Hyderabad Crime:వలపు వల విసిరి వెంటవచ్చేలా చేసి... కుర్రాన్ని ఈ కిలేడీ ఏం చేసిందంటే

Arun Kumar P   | Asianet News
Published : Aug 29, 2021, 07:37 AM ISTUpdated : Aug 29, 2021, 07:42 AM IST
Hyderabad Crime:వలపు వల విసిరి వెంటవచ్చేలా చేసి... కుర్రాన్ని ఈ కిలేడీ ఏం చేసిందంటే

సారాంశం

యువకుడికి మాయమాటల చెప్పి తనవెంట వచ్చేలా చేసి నిలువునా దోచుకుని మోసం చేసింది ఓ కిలేడీ. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  

హైదరాబాద్: వలపు వల విసిరి క్షణాల్లో యువకున్ని బుట్టలో విసిరింది మాయ'కి'లేడి. మాయమాటలు నమ్మిన యువకుడు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుని మరీ మహిళతో వెళ్లి నిలువునా మోసపోయిన ఘటన తెలంగాణ రాజధాన్ని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన యువకుడు శ్రీధర్ ఆగస్ట్ 22న భద్రాచలంకు పయనమయ్యాడు. ఈ క్రమంలోనే ఉదయం కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ కు వెళ్ళాడు. రైలు కోసం ఎదురుచూస్తున్న క్రమంలో శ్రీధర్ ను ఓ మహిళ పరిచయం చేసుకుంది. అతడికి మాయమాటలు చేప్పి కవ్వించి తన వెంట వచ్చేలా చేసింది. 

read more  నాగర్‌కర్నూల్‌లో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య.. అస్థిపంజరమై లభించిన బాడీ

మహిళ మాటల మాయలో పడిపోయిన శ్రీధర్ తన ప్రయాణాన్ని పక్కనపెట్టి ఆమె వెంట వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఆటోలో ఎల్లమ్మబండ ప్రాంతానికి తీసుకెళ్ళింది. అక్కడ నిర్మానుష్య ప్రాంతానికి శ్రీధర్ ను తీసుకెళ్ళిన సదరు మహిళ తన పని కానిచ్చేసింది. 

జోగేందర్ సింగ్, ముత్యాల విష్ణు అనే మరో ఇద్దరితో కలిసి శ్రీధర్ ను చితకబాది అతడి వద్దనుండి పర్సు, ఫోన్, వాచ్ తో పటు మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. ఇలా మాయలేడి వలలో పడిప మోసపోయిన శ్రీధర్ తన స్నేహితుడి సాయంతో పోలీసులను ఆశ్రయించాడు.  దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మహిళతో పాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.  వారి నుండి కొంత బంగారం, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ముక్కూ మొహం తెలియని వారిని నమ్మవద్దని పోలీసులు సూచించారు. 

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్