కేటీఆర్ సూచన.. కదిలిన యంత్రాంగం: ఇకపై ట్యాంక్‌బండ్‌పై ఆదివారం ట్రాఫిక్‌ ఆంక్షలు, టైమింగ్స్ ఇవే

By Siva KodatiFirst Published Aug 28, 2021, 9:33 PM IST
Highlights

హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం ట్యాంక్‌బండ్‌పై ఆదివారాల పూట సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై స్పందించిన నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్‌లో ఇకపై ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్‌బండ్ రోడ్లను మూసివేస్తున్నట్లు నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ ప్రకటించారు. కేవలం సందర్శకులకు మాత్రమే ట్యాంక్‌బండ్‌ మీదకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు. సందర్శకుల కోసం ట్యాంక్ బండ్ చివర  పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. 

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం ట్యాంక్‌బండ్‌పై ఆదివారాల పూట సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరవాసుల సందర్శనకు అనుకూలంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని మంత్రి కేటీఆర్‌ పోలీసు కమిషనర్‌కు సూచించారు. హైదరాబాద్ వాసుల ట్విట్టర్‌ విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి కేటీఆర్‌..  ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు తేవాలని, నగరవాసుల సందర్శనకు అనుకూలంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని సీపీకి సూచించారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ విధించాలని తెలిపారు. ట్యాంక్‌బండ్ అందాలను ఆస్వాదించడానికి అనుకూలంగా ఉండేలా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయాలని మంత్రి పేర్కొన్నారు.
 

click me!