తెలంగాణ: కొత్తగా 325 మందికి పాజిటివ్.. 6,57,119కి చేరిన కరోనా కేసుల సంఖ్య

By Siva Kodati  |  First Published Aug 28, 2021, 8:56 PM IST

తెలంగాణలో కొత్తగా 325 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 424 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 6,065 యాక్టివ్‌ కేసులు వున్నాయి.


తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 78,787 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 325 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,57,119కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన  24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు తెలంగాణలో వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 3,869కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 424 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,47,185కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 6,065 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 6, జీహెచ్ఎంసీ 89, జగిత్యాల 13, జనగామ 3, జయశంకర్ భూపాలపల్లి 2, గద్వాల 3, కామారెడ్డి 4, కరీంనగర్ 26, ఖమ్మం 24, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 5, మంచిర్యాల 8, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 19, ములుగు 2, నాగర్ కర్నూల్ 2, నల్గగొండ 17, నారాయణపేట 1, నిర్మల్ 0, నిజామాబాద్ 3, పెద్దపల్లి 12, సిరిసిల్ల 7, రంగారెడ్డి 15, సిద్దిపేట 7, సంగారెడ్డి 4, సూర్యాపేట 10, వికారాబాద్ 3 వనపర్తి 4, వరంగల్ రూరల్ 7, వరంగల్ అర్బన్ 22, యాదాద్రి భువనగిరిలో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Latest Videos

 

Media Bulletin on status of positive cases in Telangana.
(Dated.28.08.2021 at 5.30pm) pic.twitter.com/uVEmvfwmaP

— IPRDepartment (@IPRTelangana)
click me!