పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఒకేసారి 86 మంది బదిలీ:హైద్రాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలనం

By narsimha lode  |  First Published Jan 31, 2024, 12:29 PM IST

హైద్రాబాద్  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో  86మంది  సిబ్బందిని ఒకేసారి బదిలీ చేస్తూ  హైద్రాబాద్ సీపీ  కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
 


హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సిబ్బందిని మొత్తం  మార్చారు  హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేసే  సీఐ స్థాయి అధికారి నుండి హోంగార్డులుగా విధులు నిర్వహిస్తున్న 86 మందిని  బదిలీ చేస్తూ  నిర్ణయం తీసుకున్నారు. వీరందరినిక ఏఆర్ కు అటాచ్ చేశారు.  నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల నుండి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు అధికారులను బదిలీ చేస్తున్నారు.

బోధన్ మాజీ ఎమ్మెల్యే  షకీల్  తనయుడు ప్రజా భవన్ బారికేడ్ ను ఢీకొట్టిన అంశం విషయంలో పంజాగుట్ట సీఐపై  ఆరోపణలు వచ్చాయి.  దీంతో  పంజాగుట్ట సీఐని విధుల నుండి తప్పించారు. 

Latest Videos

undefined

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బందిని  సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.బదిలీ అయిన 86 మందిలో  82 మందికి పోస్టింగ్ ఇచ్చారు. ఇంకా నలుగురికి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఉత్తమమైన పోలీస్ స్టేషన్. అయితే ఈ పోలీస్ స్టేషన్ పై ఆరోపణలు రావడంతో  హైద్రాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి  ఈ నిర్ణయం తీసుకున్నారు. 

దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా పేరొందిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో  విధులు నిర్వహించే  సిబ్బందిపై ఇటీవల కాలంలో ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న  హైద్రాబాద్ సీపీ  కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేసే  సిబ్బందిని బదిలీ చేశారు. 

also read:కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ క్లోజ్: రాజకీయ రచ్చ, టీడీపీ -జనసేనపై వైఎస్ఆర్‌సీపీ ఫైర్

ప్రజా భవన్ కూడా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తుంది. దీంతో ప్రజాభవన్ బారికేడ్లను  బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడు  కారు ప్రమాదం అంశం విచారణ సమయంలో అనేక అంశాలను పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినట్టుగా  ప్రచారం సాగుతుంది. దీంతో  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది అందరిని ఒకేసారి మార్చారు సీపీ శ్రీనివాస్ రెడ్డి.

 

click me!