
తెలంగాణ వాహనదాదరులకు బిగ్ అలెర్ట్. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు డిస్కౌంట్ పై చెల్లించేందుకు నేడే చివరి అవకాశం. వాస్తవానికి ఈ నెల 10వ తేదీనే చివరి అవకాశమని ప్రభుత్వం మొదట చెప్పింది. కానీ సర్వర్ సమస్యలతో పాటు ప్రజలు నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో దానిని పొడగించింది. జనవరి 31వ తేదీ వరకు ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ వర్తిస్తుందని పేర్కొంది.
Jharkhand: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ భార్యకు బాధ్యతలు?
అయితే ఆ పొడగింపు కూడా నేటితో ముగియనుంది. మరో సారి ఈ అవకాశాన్ని పొడగించేది లేదని పోలీసు అధికారులు గతంలోనే తేల్చి చెప్పారు. కాగా.. ప్రభుత్వం చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించిన నాటి నుంచి ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. ఈ నెల 28వ తేదీ వరకు 1.53 కోట్ల వాహనదారులు తమ పెండింగ్ చలాన్లను క్లియర్ చేశారు. దీని వల్ల తెలంగాణ ప్రభుత్వానికి రూ.136 కోట్లు వచ్చాయి.
పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం 2023 డిసెంబర్ 22వ తేదీన కీలక ప్రకటన చేసింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు చెల్లిస్తే భారీ డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. అదే నెల 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు వాటిని చెల్లించేందుకు అవకాశం ఇస్తామని పేర్కొంది. ఈ విషయం డిసెంబర్ 26వ తేదీన ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాయితీ ఇవ్వడంతో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
Kumari Aunty : అసలు ఎవరీ కుమారి ఆంటీ... ఏమిటా కథ..?
అయితే మధ్యలో నకిలీ వెబ్ సైట్ లు పుట్టుకురావడం, అసలైన వెబ్ సైట్ సర్వర్ డౌన్ కావడంతో వాహనదారులు పెండింగ్ చలాన్లను చెల్లించలేకపోయారు. దీంతో గడవును జనవరి 30వ తేదీ వరకు పెంచింది. కాగా.. టూ వీలర్స్, త్రీ వీలర్స్ వాహనాలపై 80 శాతం, కార్లపై 50 శాతం, హెవీ వెహికల్స్, ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలపై 60 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది.
ఛత్తీస్‌గడ్ : సెక్యూరిటీ క్యాంప్‌పై మావోల మెరుపుదాడి, ముగ్గురు పోలీసులు మృతి.. 14 మందికి గాయాలు
ఇదిలా ఉండగా.. 2022లో కూడా పెండింగ్ చలాన్ల కు ప్రభుత్వం డిస్కౌంట్ ఇవ్వడంతో భారీగానే ఆదాయం సమకూరింది. ఆ ఏడాది తెలంగాణ సర్కార్ ఖజానాకు రూ . 300 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. అయితే ఈ ఏడాదిలో ఇప్పటికే రూ. 136 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే చివరి రోజు వరకు అత్యధిక మంది వాహనదారులు చలాన్లు కట్టే అవకాశం ఉంది. దీంతో ఇంకా ఆదాయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.