కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ క్లోజ్: రాజకీయ రచ్చ, టీడీపీ -జనసేనపై వైఎస్ఆర్‌సీపీ ఫైర్

By narsimha lode  |  First Published Jan 31, 2024, 10:04 AM IST

హైద్రాబాద్ మాదాపూర్ లో కుమారీ ఆంటీ స్ట్రీట్ సైడ్ ఫుడ్ బిజినెస్ పై   క్లోజ్ చేయడంపై  రాజకీయ రచ్చ సాగుతుంది. 


హైదరాబాద్:నగరంలోని  మాదాపూర్ లో  గల కుమారి ఆంటీ  స్ట్రీట్ సైట్ ఫుడ్ సెంటర్  మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అధికారంలో  ఉన్న  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) స్పందించింది.

 

మొత్తానికి , ఇద్దరికీ సీఎం వైయస్ జగన్ గారి పేరు వింటేనే వణుకు పుడుతోంది. అందుకే జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతో ఆమె మీద దాడులకు ఈ దత్త తండ్రి కొడుకులు… pic.twitter.com/EcfWmsxHOB

— YSR Congress Party (@YSRCParty)

Latest Videos

undefined

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా  కుమారీ ఆంటీ  మాట్లాడిన విషయాన్ని  వైఎస్ఆర్‌సీపీ గుర్తు చేసింది.  ఈ కారణంగానే  కుమారీ ఆంటీపై దాడులకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉసిగొల్పారని వైఎస్ఆర్‌సీపీ ఆరోపించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు  కుమారీ ఆంటీపై  తెలంగాణ ప్రభుత్వంతో  దాడులకు  ఉసిగొల్పారని  వైఎస్ఆర్‌సీపీ ఆరోపించింది.   

also read:Kumari Aunty: కుమారీ ఆంటీ బిజినెస్ క్లోజ్.. మద్దతుగా నిలిచిన యంగ్ హీరో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కుమారీ ఆంటీ  హైద్రాబాద్  మాదాపూర్ లో   స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో కుమారీ ఆంటీ గురించి పెద్ద ఎత్తున  ప్రచారం సాగింది.  దరిమిలా  కుమారీ ఆంటీ  పుడ్ సెంటర్ వ్యాపారం లాభసాటిగా మారింది. ఈ కారణంగానే  కుమారీ ఆంటీ  స్ట్రీట్ సైడ్ ఫుడ్ సెంటర్ కు  పెద్ద ఎత్తున  గిరాకీ వస్తుండేది.  అయితే ట్రాఫిక్ జామ్ కు  ఈ సెంటర్ కారణమైందనే ఉద్దేశ్యంతో  వారం రోజుల పాటు ఈ టిఫిన్ సెంటర్ ను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కారణంగా తనకు  ఏపీ రాష్ట్రంలో ఇళ్లు వచ్చిందని కుమారీ ఆంటీ  చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరలైంది. జగనన్న  పాలనలో  ఇళ్లు వచ్చిందని చెప్పడంతోనే  కుమారీ ఆంటీపై  తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వైఎస్ఆర్‌సీపీ ఆరోపణలు చేసింది.

కుమారీ ఆంటీ అంశం  ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య అంశంగా మారింది.  రెండు రాష్ట్రాల రాజకీయ పార్టీల మధ్య కూడ చర్చకు దారి తీసింది.  సోషల్ మీడియాలో  వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ-జనసేన  కూటమి  మధ్య  వాదనలకు కారణమైంది.
 

click me!