నారాయణగూడ సిఐ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సివి ఆనంద్ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ : చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటమే కాదు అలాంటి పనులు చేసేవారికి సహకరించడమూ నేరమే. మరి ఇలాంటి వాటిని అడ్డుకోవాల్సిన పోలీసులు మరెంత బాధ్యతగా వుండాలి. కానీ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఇల్లీగల్ దందాలను అడ్డుకోవడంలో విఫలమైన పోలీస్ పై హైదరాబాద్ కమీషనర్ వేటు వేసారు. నారాయణగూడ సిఐ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సిపి ఆనంద్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
నారాయణగూడ పరిసరాల్లో హుక్కా సెంటర్ల యధేచ్చగా నడుస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇటీవల హుక్కా సెంటర్లపై దాడులు నిర్వహించి నిర్వకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా స్థానిక సిఐ వ్యవహారం బయటపడింది.
Read More పోలీసులపై దాడి: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్
సిఐ శ్రీనివాస్ రెడ్డి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నారాయణగూడలో హుక్కా సెంటర్ల నిర్వహణపై సమాచారం వున్నా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తేలింది. ఈ విషయం కమీషనర్ సివి ఆనంద్ దృష్టికి వెళ్ళడంతో సదరు సీఐను వెంటనే సస్పెండ్ చేసారు.