
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు. చాలా కాలంగా ముఖ్యమంత్రి తనను కలవలేదని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 ప్రకారం గవర్నర్‌తో సీఎం కాలానుగుణంగా చర్చలు జరపడం తప్పనిసరి అని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో అలా జరగడం లేదని చెప్పారు. రెండేళ్లుగా సీఎం తనను కలవలేదని తెలిపారు. గవర్నర్, సీఎంల మధ్య సత్సంబంధాలు ఉండాలని.. అయితే ఈ విషయంలో తెలంగాణ వెనకబడి ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు తాను కారణం కాదని చెప్పారు.
ఇక, తమిళనాడు మదురైలోని మీనాక్షి అమ్మవారిని ఈరోజు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజులు నిర్వహించారు. మీనాక్షి దేవి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ జీవితంలో సకల సంపదలు పొందాలని కోరకున్నట్టుగా తమిళిసై సౌందర్‌రాజన్ తెలిపారు.