హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. నాలుగు రోజులు వాహనదారులకు అవగాహన కల్పిస్తామన్న సీవీ ఆనంద్

By Sumanth KanukulaFirst Published Oct 3, 2022, 2:25 PM IST
Highlights

హైదరాబాద్ నగరంలో ఆపరేషన్ రోప్ అమలు చేస్తున్నట్టుగా నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనందర్ తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో ఆపరేషన్ రోప్ అమలును సీవీ ఆనంద్,  ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగ నాథ్ పర్యవేక్షించారు. 
 

హైదరాబాద్‌లో నేటి  నుంచి ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు కఠినతరం చేశారు. నగరంలో ఆపరేషన్ రోప్ అమలు చేస్తున్నట్టుగా నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనందర్ తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో ఆపరేషన్ రోప్ అమలును సీవీ ఆనంద్,  ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగ నాథ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు సంబంధించి కొన్నిచర్యలు చేపట్టకపోతే సమస్యలు వస్తాయని అన్నారు. 

రోనా తో నగరంలో వాహనాల సంఖ్య పెరిగిందన్నారు. చాలామంది సొంత వాహనాలు వియోగిస్తున్నారని..దీంతో ట్రాఫిక్ రద్దీ పెరిగిందన్నారు. బెంగళూరు ట్రాఫిక్ ‌జామ్‌లు ఎక్కువగా ఉన్నాయని.. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌లో రాకుండా ఉండాలంటే సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పారు.  వాహనదారుల్లో పరివర్తన రావాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ కఠిన తరం చేశామన్నారు. 

ఆపరేషన్ రోప్‌పై మరో 4 రోజులు వాహనదారులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. నాలుగురోజులు ఎలాంటి చలాన్లు విధించడం లేదని తెలిపారు. 4 రోజుల తర్వాత చలాన్లు విధించనున్నట్టుగా చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు.  

ఇక, కొత్త రూల్స్ ప్రకారం..  ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100 ఫైన్‌ విధించనున్నారు. ఫ్రీలెఫ్ట్‌కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే రూ.1,000 వరకు జరిమానా విధిస్తారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు  చేసినా, పాదచారులకు ఆటంకం కలిగించేలా వాహనాలు నిలిపితే భారీగా జరిమానా విధించనున్నారు. 
 

click me!