18 సంవత్సరాల క్రితం నేరం... ఇప్పుడు పోలీసులకు చిక్కాడు

Published : Sep 20, 2019, 11:18 AM IST
18 సంవత్సరాల క్రితం నేరం... ఇప్పుడు పోలీసులకు చిక్కాడు

సారాంశం

నిందితుడు ఎండీ ఫైజుద్దీన్(51) కి 1993లో ఫాతిమా పర్వీన్ తో వివాహం జరిగింది. ఉస్మానియా పోలీస్ స్టేషన్ పరిధిలో వీరు నివసించేవారు. కాగా పెళ్లి జరిగిన నాటి నుంచి ఫైజుద్దీన్ తన భార్య ఫాతిమాని నానా రకాలు వేధించేవాడు. కాగా... అతని వేధింపులు తట్టుకోలేక ఫాతిమా 1994లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంది.

18సంవత్సరాల క్రితం అతను నేరం చేశాడు. అప్పుడే అతనిని న్యాయస్థానం దోషిగా తేల్చింది. కానీ... ఆయన మాత్రం ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన  హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  నిందితుడు ఎండీ ఫైజుద్దీన్(51) కి 1993లో ఫాతిమా పర్వీన్ తో వివాహం జరిగింది. ఉస్మానియా పోలీస్ స్టేషన్ పరిధిలో వీరు నివసించేవారు. కాగా పెళ్లి జరిగిన నాటి నుంచి ఫైజుద్దీన్ తన భార్య ఫాతిమాని నానా రకాలు వేధించేవాడు. కాగా... అతని వేధింపులు తట్టుకోలేక ఫాతిమా 1994లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఆమె ఆత్మహత్యకు భర్త ఫైజుద్దీన్ కారణమంటూ ఫాతిమా కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఫైజుద్దీన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు సంవత్సరాల తర్వాత కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణలు జరపగా... 1996లో అతను నేరస్థుడిగా కోర్టు నిర్ధారించింది. అయితే... కోర్టులో లొంగిపోకుండా.. ఫైజుద్దీన్... అరెస్టు భయంతో పరారయ్యాడు. 18 సంవత్సరాల తర్వాత తాజాగా పోలీసులకు చిక్కాడు. అతనిని చంచల్ గూడ జైలుకి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే