బాలికపై అత్యాచారం... ఆటో డ్రైవర్ కి పదేళ్ల జైలు శిక్ష

Published : Sep 20, 2019, 07:53 AM IST
బాలికపై అత్యాచారం... ఆటో డ్రైవర్ కి పదేళ్ల జైలు శిక్ష

సారాంశం

2015 నుంచి ఆటో డ్రైవర్ వెంకట రాజేష్(37) బాలికను, ఆమె తమ్ముడిని ఆటోలో తీసుకొని వెళ్లేవాడు. కాగా... 2016 డిసెంబర్‌ 14వ తేదీన పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలిక కడుపు నొప్పి వస్తోందని తల్లికి చెప్పింది. ఏమైందని నిలదీయగా.. ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేశాడని చెప్పగా.. వైద్యుల వద్దకు తీసుకెళ్లింది.   

బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఓ ఆటో డ్రైవర్ కి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.... హైదరాబాద్ నగరానికి చెందిన ఓ బాలిక ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. రోజూ బాలిక ఆటోలో తన తమ్ముడితో కలిసి ఆటోలో స్కూల్ కి వెళ్లేది.

2015 నుంచి ఆటో డ్రైవర్ వెంకట రాజేష్(37) బాలికను, ఆమె తమ్ముడిని ఆటోలో తీసుకొని వెళ్లేవాడు. కాగా... 2016 డిసెంబర్‌ 14వ తేదీన పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలిక కడుపు నొప్పి వస్తోందని తల్లికి చెప్పింది. ఏమైందని నిలదీయగా.. ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేశాడని చెప్పగా.. వైద్యుల వద్దకు తీసుకెళ్లింది. 

గర్భవతి అని నిర్ధారణ కావడంతో నిందితుడు వెంకట రాజే‌ష్ పై లాలాగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రెండువేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్