ఆమెతో కుదరని డీల్.. సాఫ్ట్ వేర్ పై కత్తులతో దాడి..

Published : Aug 20, 2025, 12:37 AM ISTUpdated : Aug 20, 2025, 09:21 AM IST
Police Vehicle

సారాంశం

Hyderabad KPHB: హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వ్యభిచారినికి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మధ్య జరిగిన గొడవ తీవ్ర స్థాయి చేరుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై కత్తితో దాడి చేసే వరకు వెళ్లింది.  

Hyderabad: హైదరాబాద్‌లో రాత్రివేళ ఒక చిన్నపాటి వాగ్వాదం క్షణాల్లోనే కత్తిపోరుగా మారింది. వీధిలో జరిగిన ఘర్షణలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సాధారణంగా కుటుంబాల రాకపోకలు, ఉద్యోగుల రద్దీ కనిపించే ప్రాంతం అకస్మాత్తుగా యుద్దవాతావరణాన్ని తలపించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితి అదుపులోకి వచ్చారు. ఈ దారుణం  హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ రోడ్ నంబర్-1లో జరిగింది. 

 అసలు గొడవేంటి?

పోలీసుల వివరాల ప్రకారం, ఒక వ్యభిచారిణితో బుక్ చేసుకునే సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఆ మహిళ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. క్షణాల్లోనే ఆ మాటల తగువు ఘర్షణకు దారితీసింది. ఆ మహిళ తన బంధువుకు ఫోన్  చేయడంతో పరిస్థితి కొత్త మలుపు తీసుకుంది. కొద్ది నిమిషాల్లోనే ఆమె స్నేహితులు, అనుచరులు అక్కడికి చేరుకుని ఉద్రిక్తతను మరింత పెంచాడు. చుట్టుపక్కల వారు ఏమి జరుగుతుందో గ్రహించేలోపే వాతావరణం వేడెక్కిపోయింది.

 ఆగ్రహంతో విరుచుకుపడిన గ్యాంగ్ సభ్యులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై కత్తులతో దాడి చేశారు. ఒక్కసారిగా కత్తులతో  మెరుపు దాడి చేశారు. అరుపులు, కేకలతో అక్కడి పరిస్థితి సినిమా ఫైట్‌లా మారిపోయాయి. ప్రాణభయంతో స్థానికులు తమ ఇళ్లలోకి పరుగులు తీశారు. రక్తస్రావంతో రోడ్డు మీద కుప్పకూలిన ఆ ఉద్యోగిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతని పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడిలో పాల్గొన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలో శాంతి భద్రతలతో చెలగాటమాడే వారిని విడిచిపెట్టబోమని పోలీసులు స్పష్టం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే