ఆన్‌లైన్ బెట్టింగ్‌తో రూ. 2 వేల కోట్లు కొల్లగొట్టిన చైనా: బ్యాంకు ఖాతాల గుర్తింపు

By narsimha lodeFirst Published Aug 23, 2020, 4:41 PM IST
Highlights

ఆన్ లైన్ బెట్టింగ్ పేరుతో  వేల కోట్లు కొల్లగొట్టిన చైనా కంపెనీపై హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. చైనా కంపెనీ రూ. 2 వేల కోట్లకు స్కాం  చేసినట్టుగా సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు


హైదరాబాద్: ఆన్ లైన్ బెట్టింగ్ పేరుతో  వేల కోట్లు కొల్లగొట్టిన చైనా కంపెనీపై హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. చైనా కంపెనీ రూ. 2 వేల కోట్లకు స్కాం  చేసినట్టుగా సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు. తొలుత రూ. 1,100 కోట్లను చైనాకు తరలించినట్టుగా భావించినా ... దర్యాప్తులో మరో వెయ్యి కోట్లు కూడ చైనాకు తరలివెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఆన్ లైన్ బెట్టింగ్ పేరుతో ఇండియాకు చెందిన పలువురి నుండి వేల కోట్లను చైనాకు తరలించినట్టుగా పోలీసులు గుర్తించారు. రూ. 2 వేల కోట్లు రెండు అకౌంట్ల నుండి చైనాకు బదిలీ అయినట్టుగా గుర్తించారు.

దాకిపే, లింక్ యూ కంపెనీల నుండి నిధులు బదిలీ అయినట్టుగా సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఢిల్లీకి చెందిన ధీరజ్ కీలకపాత్ర పోషించినట్టుగా సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ధీరజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఈ కేసులో మరో రెండు కొత్త అకౌంట్లను గుర్తించారు సీసీఎస్ పోలీసులు.

click me!