కరోనా కట్టడి విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై చేసిన విమర్శలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. డాక్టర్ గా తమిళిసై సూచనలు చేశారని కిషన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: కరోనా కట్టడి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పు పడుతూ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలతో కేంద్రానికి ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు
ఒక డాక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలవు చేశారని ఆయన అన్నారు దాన్ని రాజకీయ కోణం నుంచి చూడాల్సిన అవసరం లేదని అన్నారు. గవర్నర్ వృత్తిపరంగా డాక్టర్ అని ఆమె చేసిన సూచలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆదివారం మీడియాతో అన్నారు.
undefined
వ్యక్తిగతంగా దేశ పౌరురాలిగా తమిళిసై సలహాలు ఇచ్చారని ఆయన అన్నారు. బిజెపికి గానీ కేంద్ర ప్రభుత్వానికి గానీ గవర్నర్ వ్యాఖ్యలతో సంబంధం లేదని ఆయన చెప్పారు. కేంద్రంతో అన్ని రాష్ట్రాలకూ మంచి సంబంధాలే ఉన్నాయని ఆయన అన్నారు.
రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా కరోనాపై పోరాటం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా పరీక్షలు, చికిత్సల విషయంలో గవర్నర్ చేసిన సూచనలను ప్రభుత్వం పాటించి ఉంటే బాగుండేదని కిషన్ రెడ్డి అన్నారు.