క్యాసినోలకు సినీతారల ప్రచారం.. యాక్టర్లకు ఈడీ నోటీసులు ?

By Bukka Sumabala  |  First Published Jul 29, 2022, 10:18 AM IST

క్యాసినో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. క్యాసినోకు ప్రచారంలో పాల్గొన్న సినీ తారల మీద ఈడీ దృష్టి సారిస్తోంది. వారికి నోటీసులు జారీ చేయనుంది.


హైదరాబాద్ :  క్యాసినో వ్యవహారంలో ఈడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. నేపాల్లో క్యాసినోకు ప్రచారకర్తగా వ్యవహరించిన సినీ తారలపై ఈడి దృష్టి సారించింది. కేసినోకు ప్రచారం చేసిన సినీ తారలు లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఏవి అధికారులు అనుమానిస్తున్నారు. పారితోషకం తీసుకున్న సినీ తారలకు నోటీసు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో సినీ తారల ప్రచార దృశ్యాలను చికోటి ప్రవీణ్ అప్లోడ్ చేసిన విషయం తెలిసిందే. Chikoti Praveen, మాధవరెడ్డి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్న అధికారులు కొందరు సినీ ప్రముఖులకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు.

క్యాసినో ఏజెంట్లు ప్రవీణ్ చీకొట్టి, మాధవరెడ్డిలకు ఈడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. బషీర్బాగ్లోని  ఈడీ కార్యక్రమంలో తమ ఎదుట సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైన ఈడీ సోదాలు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగాయి. ఐఎస్ సదన్ లోని ప్రవీణ్ ఇంటితో పాటు కడ్తాల్ లో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లోనూ సోదాలు చేశారు. బోయిన్పల్లిలోని మాధవ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. 8 బృందాలుగా ఏర్పడిన ఈడీ అధికారులు 16 గంటలకు పైగా తనిఖీలు చేశారు.

Latest Videos

undefined

విచారణకు రావాలి: చీకోటి ప్రవీణ్ కు ఈడీ నోటీసులు

ప్రవీణ్ ఇంట్లో  ఫోన్లు, లాప్ టాప్ తో పాటు ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మాధవ రెడ్డి నివాసంలో బ్యాంకు పాసుబుక్కులు స్వాధీనం చేసుకున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంగించ్చినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఈ ఏడాది జనవరి, జూన్ నెలల్లో ప్రవీణ్ మాధవరెడ్డి కలిసి నేపాల్ లో భారీ ఎత్తున నిరసన నిర్వహించినట్లు ఈడీ అధికారులు తేల్చారు. దీని కోసం పలువురు సినీ తారలను ప్రచారకర్తగా ఉపయోగించుకున్నారు. వారి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి తెలుగు రాష్ట్రాల్లో చాలామందిని ఆకర్షించారు. శంషాబాద్ నుంచి నేపాల్ కు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి క్యాసినోకి తీసుకు వెళ్లినట్లు ఈడీ గుర్తించింది. 

నేపాల్, థాయిలాండ్, ఇండోనేషియాలో జరిగే క్యాసినోలకు ఇక్కడి నుంచే పేకాటరాయుళ్లను తీసుకువెళ్లి భారీగా డబ్బు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా, క్యాసినో వ్యవహరంలో చీకోటి ప్రవీణ్ కుమార్ కు గురువారం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆగష్టు 1వ తేదీన  విచారణకు రావాలని ఈడీ అధికారులు  చీకోటిప్రవీణ్ కు నోటీసులు జారీ చేశారు. 16 గంటలపాటు సాగిన ఈడీ అధికారుల రైడ్స్ లో కీలక సమాచారం సేకరించారని తెలుస్తుంది. 

ఈ విషయం మీద విచారణకు సోమవారం రావాలని Chikoti Praveenకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి చీకోటిప్రవీణ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించనున్నారు. కేసినోతో పాటు క్రికెట్ బెట్టింగ్స్ కు సంబంధించి అంశాలపై ప్రవీణ్ ను ఈడీ ప్రశ్నించనుంది. ఇప్పటికే చీకోటి ప్రవీణ్ మీద కేసు నమోదయ్యింది.

click me!