
హైదరాబాద్: మీరు నా తల్లి దండ్రులు కారు, నా పూర్వ జన్మ తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నానని ఫోన్ లో Selfie Video రికార్డు చేసి ఓ బాలుడు ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఈ ఘటన Hyderabad లోని Neredmet లో చోటు చేసుకొంది.
హైద్రాబాద్ నేరేడ్‌మెట్ న్యూ విద్యా నగర్ లో ఉండే దంపతులకు 15, 13 ఏళ్ల వయస్సున్న పిల్లలున్నారు. పిల్లలను భార్య వద్ద వదిలేసి భర్త వేరుగా ఉంటున్నాడు. పిల్లలిద్దరూ కూడా ఇంట్లో నుండే ఆన్ లైన్ లో పాఠాలు వింటున్నారు. ఇంట్లోనే ఉన్న Mobile ఫోన్ లో చిన్న కొడుకు వీడియో రికార్డు చేశాడు. మీరు నా తల్లి దండ్రులు కారన్నారు. నా పూర్వ జన్మ తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నానని చెప్పారు. ఈ వీడియో ను రికార్డు చేసిన అతను ఇంటి నుండి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆ బాలుడి కోసం వెతికినా ప్రయోజనం దక్కలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. Boy ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.