లోయర్ ట్యాంక్ బండ్ వద్ద డంపింగ్ యార్డ్‌లో పేలుడు... తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలు..

Published : Dec 15, 2022, 04:50 PM ISTUpdated : Dec 15, 2022, 05:29 PM IST
లోయర్ ట్యాంక్ బండ్ వద్ద డంపింగ్ యార్డ్‌లో పేలుడు... తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలు..

సారాంశం

హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర పేలుడు చోటుచేసుకుంది. చెత్త డంపింగ్ యార్డ్‌లో పేలుడు జరిగింది. 

హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర పేలుడు చోటుచేసుకుంది. చెత్త డంపింగ్ యార్డ్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరు కూడా చెత్త ఎరుకునేవారని తెలుస్తోంది. ప్రస్తుతం వారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుండగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఈ ఘటనపై సమాచారం అందుకన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్‌ కూడా అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరిస్తుంది. పేలుడు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెయింట్‌లో ఉండే టర్బెంట్ ఆయిల్‌తో పేలుడు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో కూడా భారీగా  పెయింట్స్ డబ్బాలు ఉండటం పోలీసుల అనుమానాలకు బలం చేకూరుస్తుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : ఇంకో మూడ్రోజులే ఫుల్ వర్కింగ్ డేస్... తర్వాత వరుస సెలవులే, బ్యాక్ టు బ్యాక్ లాంగ్ వీకెండ్స్
Hyderabad Real Estate : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్... ఇక్కడ ఒక్క ఎకరం రూ.250 కోట్లా..!