కరోనాకి హెటిరో మందు.. ధర ఎంతంటే..?

Published : Jun 25, 2020, 11:25 AM IST
కరోనాకి హెటిరో మందు.. ధర ఎంతంటే..?

సారాంశం

ఇక మరో వైపు సిప్లా సంస్థ కూడా పోటాపోటీన మరో మెడిసిన్ తో ముందుకొచ్చింది సిప్లా తయారు చేసిన మెడిసిన్ యొక్క ధర 5 వేల లోపే ఉంటుంది అని సంస్థ వెల్లడించింది.   

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ కి మందు కనిపెట్టేందుకు పలు దేశాల్లో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కాగా... ఇటీవల హైదరాబాద్ కి చెందిన హెటిరో సంస్థ కరోనాకి మందు కొనుగొన్న సంగతి తెలిసిందే. కోవిఫర్ పేరిట ఈ మందుని తయారు చేశారు.

కాగా..కోవిఫర్ 100 ఎం‌జీ.. ఈ మెడిసిన్ జెనరిక్ మేడిసిన్ గా ఇంజెక్షన్ రూపంలో ప్రజలకు లభ్యమవుతుంది. ఇక మరో వైపు సిప్లా సంస్థ కూడా పోటాపోటీన మరో మెడిసిన్ తో ముందుకొచ్చింది సిప్లా తయారు చేసిన మెడిసిన్ యొక్క ధర 5 వేల లోపే ఉంటుంది అని సంస్థ వెల్లడించింది. 

ఇక ఇప్పుడు తాజాగా హెటిరో సంస్థ కూడా కోవిఫర్ 100 ఎంజీ ధరను ప్రకటించింది. 100 ఎంజీ ఇంజెక్షన్ ధర ను 5400 గా సంస్థ నిర్ణయించింది అంటే సుమారు 71 డాలర్లు. దాదాపుగా 20 వేల వెయిల్స్ ను మార్కెట్ లోకి తక్షణమే విడుదల చేస్తున్నామని సంస్థ పేర్కొంది. ఇక 127 దేశాలకు డ్రగ్ ను ఎగుమతి చేయాలని సంస్థ నిశ్చయించుకుంది.

ముందుగా 20,000 వయల్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ బుధవారం తెలిపింది. ఇందులో 10,000 వయల్స్‌ హైదరాబాద్, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు త్వరలోనే సరఫరా చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. భువనేశ్వర్‌, రాంచీ, విజయవాడ, కోచి, త్రివేండ్రం, గోవా తదితర నగరాలకు వారం రోజుల వ్యవధిలో ఈ ఔషధాన్ని సరఫరా చేయగలమని పేర్కొంది. 'కొవిఫర్‌' 100 ఎంజీ వయల్‌ (ఇంజక్టబుల్‌) రూపంలో వస్తుంది. ఒక్కో ఇంజక్షన్‌ వయల్‌కు రూ.5,400 ధర నిర్ణయించినట్లు హెటెరో హెల్త్‌కేర్‌ వెల్లడించింది.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్