సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలోని డెక్కన్ మాల్‌ను రేపటి నుంచి కూల్చివేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థకు రూ.33 లక్షలకు టెండర్ ఓకే అయ్యింది. భవనం కూల్చివేతకు ఆధునాతన యంత్రాలు వాడాలని , ఆ సమయంలో చుట్టుపక్కల వారికి ప్రమాదం జరగకుండా చూడాలని అధికారులు కోరారు.
సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలోని డెక్కన్ మాల్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భవనం కూల్చివేతకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు టెండర్లు పిలిచారు. ఈ సందర్భంగా 33 లక్షలకు హైదరాబాద్‌కు చెందిన కంపెనీ టెండర్లు దక్కించుకుంది. దీంతో రేపటి నుంచి పనులు మొదలెట్టనుంది కాంట్రాక్ట్ సంస్థ.
కాగా.. ఈ నెల 19వ తేదీన రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ లో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా భవనంలో ఆరు అంతస్థులు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 11 గంటల పాటు కష్టపడి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ భవనంలో ఉన్న సింథటిక్ , టైర్లు ఇతర మెటీరియల్ మంటలు త్వరగా వ్యాప్తి చెందడానికి కారణంగా మారిందనే అగ్నిమాపక సిబ్బంది అభిప్రాయపడ్డారు. ఈ భవనం నుండి నలుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అయితే ఈ భవనంలో విధులకు వెళ్లిన వారిలో ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు. ఇదే సమయంలో భవనంలోని సెల్లార్ లో ఒక అస్థిపంజరం లభ్యమైంది. ఈ ఆస్థి పంజరం నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు.
ALso REad: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ కూల్చివేత: టెండర్లు ఆహ్వానించిన జీహెచ్ఎంసీ
అగ్ని ప్రమాదం కారణంగా ఈ భవనం పూర్తిగా బలహీనపడింది. దీంతో ఈ భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయం తీసుకన్నారు. భవనం కూల్చివేత విషయంలో పక్కనే ఉన్న ఇతర భవనాలకు నష్టం వాటిల్లకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 1890 చదరపు అడుగుల్లో డెక్కన్ స్పోర్ట్స్ వేర్ భవనం నిర్మించారు. ఈ భవనం కూల్చివేతకు రూ.33.86 లక్షలతో టెండర్లను ఆహ్వానించారు జీహెచ్ఎంసీ అధికారులు. అంతేకాకుండా భవనం కూల్చివేతకు ఆధునాతన యంత్రాలు వాడాలని , ఆ సమయంలో చుట్టుపక్కల వారికి ప్రమాదం జరగకుండా చూడాలని అధికారులు కోరారు.