గ్లోబల్‌ గిఫ్ట్‌ గాలాలో మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి...

By SumaBala BukkaFirst Published Nov 23, 2022, 12:19 PM IST
Highlights

మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి  పారిస్‌లో తాజాగా జరిగిన ‘ది గ్లోబల్‌ గిఫ్ట్‌ గాలా’ ఎడిషన్‌లో భారత్‌ తరఫున పాల్గొన్నారు. 

హైదరాబాద్ : మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి గ్లోబల్‌ గిఫ్ట్‌ ఫౌండేషన్‌లో భాగస్వామురాలైన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. పారిస్‌లో తాజాగా జరిగిన ‘ది గ్లోబల్‌ గిఫ్ట్‌ గాలా’ ఎడిషన్‌లో ఆమె భారత్‌ తరఫున పాల్గొన్నారు. సంస్థ పోషకుల్లో ఒకరిగా అధికారికంగా గుర్తింపు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ ప్రచారకురాలిగా కొత్త బాధ్యతల కోసం తాను ఎదురు చూస్తున్నానని ప్రకటించారు. గాలాలో ఆమె ప్రత్యేక గౌను ధరించి తనదైన ముద్ర వేశారు.

ఇదిలా ఉండగా, నిరుడు సెప్టెంబర్ లో అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుక ‘మెట్‌ గాలా-2021’లో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గౌనులో ఆమె మెరిశారు. ఆ ఏడాది థీమ్‌ ‘అమెరికన్‌ ఇండిపెండెన్స్‌’. భారతీయ ఫ్యాషన్‌ డిజైనర్లు ఫల్గుని, షేన్‌ పీకాక్‌ ఈ డ్రెస్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. దీని తయారీకి 250 గంటలు పట్టినట్లు డిజైనర్లు తెలిపారు. 

MET Gala 2021 : తళుక్కుమన్న మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి..

మెట్‌ గాలాలో సుధారెడ్డి పాల్గొనడం ఇదే తొలిసారి. నిరుడు భారత్ నంచి పాల్గొన్నది ఆమె ఒక్కరే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ తదితరులు పాల్గొన్నారు. ఆ యేటి థీమ్ ‘అమెరికన్‌ ఇండిపెండెన్స్‌’కు తగ్గట్టు అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు ఫల్గుని, షేన్ పీకాక్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గౌనును ఆమె ధరించింది. 

click me!