మంత్రి మల్లారెడ్డి బంధువు ప్రవీణ్ రెడ్డికి అస్వస్థత: ఆసుపత్రికి తరలింపు

By narsimha lode  |  First Published Nov 23, 2022, 12:15 PM IST

తెలంగాణ  మంత్రి మల్లారెడ్డి  బంధువు  ప్రవీణ్  రెడ్డి  అస్వస్థతకు  గురయ్యారు.  ఆయనను  సూరారంలోని  ఆసుపత్రికి  తరలించారు. ఇప్పటికే  మల్లారెడ్డి  కొడుకు  మహేందర్ రెడ్డి కూడా  అస్వస్థతకు గురైన  విషయం  తెలిసిందే. 



హైదరాబాద్: తెలంగాణ  మంత్రి మల్లారెడ్డి బంధువు ప్రవీణ్  రెడ్డి  అస్వస్థతకు  గురయ్యాడు. ఆయనను  కూడా  సూరారంలోని  ఆసుపత్రికి  తరలించారు.సూరారంలోని నారాయణ  హృదయాలయానికి  మరోసారి  మంత్రి  మల్లారెడ్డి  వచ్చారు.తన కొడుకును చూడకుండా ఐటీ  అధికారులు  అడ్డుపడుతున్నారని సూరారం ఆసుపత్రి వద్ద  మంత్రి మల్లారెడ్డి బైఠాయించారు. అనంతరం ఆసుపత్రి నుండి ఆయనను  ఐటీ  అధికారులు  ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి  వెళ్లిన  కొద్దిసేపటికే  మళ్లీ  మరోసారి మంత్రి మల్లారెడ్డి  ఆసుపత్రికి వచ్చారు. 

మల్లారెడ్డి  బంధువు  ప్రవీణ్ రెడ్డి  నివాసాల్లో  కూడా  ఐటీ  అధికారులు సోదాలు  నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి   యూనివర్శిటీ  వ్యవహరాలను  ప్రవీణ్ రెడ్డి చూస్తారని  చెబుతున్నారు. మంత్రి మల్లారెడ్డితో పాటు  ఆయన  కుటుంబసభ్యులు,  బంధువుల  ఇళ్లలో  ఐటీ  అధికారులు  నిన్న ఉదయం నుండి  సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ  నుండి  వచ్చిన  ఐటీ  అధికారుల  బృందం  సోదాలు  నిర్వహిస్తుంది.  ఇవాళ  కూడా  సోదాలు  జరుగుతున్నాయి.  ఇవాళ  రాత్రి వరకు  సోదాలు  కొనసాగే అవకాశం  ఉంది. 

Latest Videos

ఐటీ  అధికారులు సోదాలు  చేస్తున్న  సమయంలో ఇవాళ  ఉదయం  మంత్రి మల్లారెడ్డి  తనయుడు  మహేందర్ రెడ్డికి అస్వస్థతకు  గురయ్యాడు.  దీంతో  ఆయనను  ఆసుపత్రిలో చేర్పించారు. మహేందర్ రెడ్డిని వైద్యులు  పరీక్షించారు.  ఈ పరీక్షలు  పూర్తైన  వైద్యులు  మీడియాతో  మాట్లాడారు.  మహేందర్ రెడ్డి  ఆరోగ్య  పరిస్థితి  నిలకడగా  ఉందని తెలిపారు.  ఈసీజీ  రిపోర్టులో  స్వల్ప మార్పులు  ఉన్నట్టుగా గుర్తించామన్నారు.  నిద్రలేకపోవడం వల్ల కావొచ్చు, ఒత్తిడి  కారణంగానో  ఇలా  జరిగి  ఉండొచ్చని వైద్యులు  చెప్పారు.మహేందర్ రెడ్డిని  నిరంతరం  పర్యవేక్షించాలని  డాక్టర్  ప్రీతిరెడ్డి  చెప్పారు. ఇవాళ  సాయంత్రం వరకు  మహేందర్ రెడ్డి ఆరోగ్యం  కుదుటపడే  అవకాశం  ఉందని డాక్టర్లు  అభిప్రాయపడ్డారు. ప్రవీణ్  రెడ్డిని రాత్రి సీఆర్‌పీఎప్  జవాన్లతో  కొట్టించారని మంత్రి మల్లారెడ్డి  ఆరోపించారు. ఐటీ  అధికారులు  టార్చర్  పెడుతున్నారన్నారు.ఆసుపత్రిలో  ఉన్నా  కూడా  ఐటీ  అధికారులు  వదిలిపెట్టడం  లేదని  మంత్రి  మల్లారెడ్డి  ఆరోపించారు.  ఆసుపత్రిలోనే  ఉంచాలని వైద్యులు  సూచిస్తున్నా  కూడా  పట్టించుకోవడం  లేదని  మంత్రి  మల్లారెడ్డి  చెప్పారు. 

also  read:పక్కా స్కెచ్‌తో మంత్రి మల్లారెడ్డి నివాసాల్లో ఐటీ దాడులు: రియల్టర్ల పేరుతో ఆఫర్లు

గతంలో  కూడా  తమ  సంస్థలపై  ఐటీ  సోదాలు జరిగిన  విషయాన్ని మంత్రి మల్లారెడ్డి  గుర్తు చేశారు.  కానీ ఏనాడు  కూడా ఇలా  సోదాలు  చేయలేదన్నారు.  కక్షపూరితంగానే  వ్యవహరిస్తున్నారని  ఆయన  కేంద్రంపై  మండిపడ్డారు.తాము  పేదలకు  సేవలు చేస్తున్నట్టుగా  మంత్రి మల్లారెడ్డి  తెలిపారు.  సూరారం  ఆసుపత్రి  వద్దకు  వచ్చిన  తన  అనుచరులను  వెళ్లిపోవాలని మల్లారెడ్డి  కోరారు.
 

click me!