బీఆర్ఎస్ ఫిర్యాదు:వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

Published : May 18, 2023, 12:48 PM IST
బీఆర్ఎస్ ఫిర్యాదు:వైఎస్ షర్మిలపై  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు

సారాంశం

వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిలపై  హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైంది.  


హైదరాబాద్:  నగరంలోని  బంజారాహిల్స్  పోలీస్ స్టేషన్ లో  గురువారంనాడు  వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిలపై  కేసు నమోదైంది.  తెలంగాణ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు   చేశారని వైఎస్ షర్మిలపై  బీఆర్ఎస్  శ్రేణులు ఫిర్యాదు చేశాయి, ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు  కేసు నమోదు  చేశారు. 

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసు విషయమై  వైఎస్ షర్మిల  సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.నిరుద్యోగులకు  భరోసా కల్పించే విధంగా  కేసీఆర్ వ్యవహరించాలని  ఆమె  కోరారు.   అఫిడవిట్ పత్రాలపై  సంతకం చేయాలని కోరారు. ఈ మేరకు  అఫిడవిట్ పై  సంతకం చేయాలని  కూడా ఆమె డిమాండ్  చేశారు. గత కొంత కాలంగా  తెలంగాణ సీఎం కేసీఆర్ సహా  బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా  చేసుకుని   వైఎస్ షర్మిల విమర్శలు  చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పెళ్లి చేసుకోరు కానీ ఒకే రూమ్‌లో క‌లిసి ఉంటారు.. ఫుడ్డు, బెడ్డు అంతా వాళ్ల‌దే. హైద‌రాబాద్‌లో కొత్త క‌ల్చ‌ర్
KCR Grandson Himanshu : కేటీఆర్ కొడుకు హిమాన్షు అమెరికాలో ఏం చదువుకుంటున్నాడో తెలుసా?