అప్సర హత్య కేసు.. పూజారి సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్.. వెలుగులోకి కీలక విషయాలు..

Published : Jun 10, 2023, 09:48 AM IST
అప్సర హత్య కేసు.. పూజారి సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్.. వెలుగులోకి కీలక విషయాలు..

సారాంశం

రాష్ట్రంలో సంచలనం రేపిన అప్సర హత్య కేసులో ప్రధాన నిందితుడు పూజారి సాయికృష్ణకు కోర్టు రిమాండ్‌ విధించింది.

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం రేపిన అప్సర హత్య కేసులో ప్రధాన నిందితుడు పూజారి సాయికృష్ణకు కోర్టు రిమాండ్‌ విధించింది. ఈ కేసులో సాయికృష్ణను అరెస్ట్ చేసిన శంషాబాద్ పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసులు సాయికృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు. 

ఇక, హైదరాబాద్‌లో మిస్సింగ్‌ అయిన అప్సర‌ను ఆమె ప్రియుడు పూజారి సాయికృష్ణ హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అప్సర మిస్సింగ్ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసులో మిస్టరీని చేధించారు. అయితే ఇదివరకే సాయికృష్ణకు పెళ్లి అయిందని.. అయితే గత కొన్నాళ్ల నుంచి అప్సరతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. అయితే వివాహం చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతో, తమ వివాహేతర సంబంధం బయటపడుతుందని ఆమెను సాయికృష్ణ హత్య చేసినట్టుగా పోలీసులు కనుగొన్నారు. 

శంషాబాద్‌  డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. హంతకుడు వెంకట సాయి కృష్ణది అంబేడ్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం నరేంద్ర పురం గ్రామం. కాగా.. హైదరాబాద్ లో సిర్థపడ్డారు. అతనికి 2010 లో పెళ్లి అయ్యింది. ఇద్దరూ పిల్లలు కూడా. అతడు  ప్రస్తుతం సరూర్ నగర్ బంగారు మైసమ్మ పూజారిగా విధులు నిర్వహిస్తూ.. మరోవైపు బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా కూడా పని చేస్తున్నాడు. ఇక అప్సరది తమిళనాడు. సినిమాల్లో నటించాలనే కోరికతో ఆమె డిగ్రీ పూర్తి కాగానే సినీ ప్రయత్నాలను ప్రారంభించింది.

Also Read: వీడిన డెత్ మిస్టరీ.. అప్సరను హతమార్చింది పూజారే..సీన్ టు సీన్ వివరించిన డీసీపీ

ఈ క్రమంలో 2022 ఏప్రిల్‌లో హైదరాబాద్ వచ్చింది. అప్సర తండ్రి కాశీ ఆశ్రమంలో నివసిస్తున్నాడు. అప్సర తరుచు సరూర్ నగర్ బంగారు మైసమ్మ ఆలయానికి వచ్చేది. ఈ క్రమంలో పూజారి సాయికృష్ణతో  పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త.. పరిమితులు దాటింది. హద్దులు దాటి శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో అస్సర గర్భం కూడా దాల్చింది. కానీ సాయి.. ఆ గర్భాన్ని తీసేయించాడు. ఈ క్రమంలో (2023 మార్చిలో) తనను పెళ్లి చేసుకోవాలని అప్సర సాయి కృష్ణపై ఒత్తిడి తీసుకవచ్చింది. ఈ సమయంలో సాయి కృష్ణకి పెళ్లి అయిందని తెలిసినప్పటికీ.. తనని కూడా పెళ్లి చేసుకోవాలని అప్సర బలవంతం చేసింది. అప్సర ప్రవర్తనతో విసిగు చెందిన సాయికృష్ణ ఆమెను  చంపాలి అని నిర్ణయించుకున్నారు.  

పథకం ప్రకారం ఈ నెల 3న ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. 4న మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌ పడేశాడు. ఆ మరుసటి 5న మ్యాన్‌హోల్‌లో మట్టి వేశాడు. అయితే.. రాత్రి వరకు దర్వాసన ఎక్కువ రావడంతో మళ్లీ కొంత మట్టి పోశాడు. మరోవైపు.. తన బిడ్డ కనిపించడం లేదని అప్సర తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించింది. అప్సర కోసం పోలీసులతోపాటు హంతకుడు సాయి కూడా అన్నిచోట్ల వెతికాడు.

Also Read: బాబుతో భేటీ.. టీడీపీలో ఆనం చేరికకు రంగం సిద్దం.. నెల్లూరులో కీలక పరిణామాలు..!!

పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్‌ ట్రాక్‌ రికార్డును పరిశీలించారు. సాయి, అప్సర సెల్ ఫోన్ల సిగ్నల్ ఒకే చోట ఉండడంతో పూజరి సాయిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పంతుల్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తనని పెళ్లి చేసుకోవాలని వేధించడంతోనే హత్య చేశానని పూజారి సాయి ఒప్పుకున్నాడు. దీంతో పాటు గత కొన్నాళ్ల నుంచి అప్సరతో వివాహేతర సంబంధం ఉందని ఒప్పుకున్నట్లు తెలిసింది. వివాహం చేసుకోవాలని అప్సర తనని ఒత్తిడి చేసిందని, తమ వివాహేతర సంబంధం బయటపడుతుందని భయంతోనే ఆమె హత్య చేశానని సాయి చెప్పినట్టు  డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!