తెలుగు సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. నగదుతో పాటు మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు.
హైదరాబాద్ : హైదరాబాద్ లో ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. ఆయన ఆఫీసులో పార్క్ చేసి ఉన్న కారు అద్దాలు పగలగొట్టి 50 వేల నగదు, 11 ఖరీదైన మద్యం బాటిళ్లు చోరి చేశారు. ఒక్కో మద్యం బాటిల్ ఖరీదు రూ. 28 వేలు ఉంటుందని చెబుతున్నారు. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆఫీసులో చోరీ జరగడం కలకలం రేపింది. ఆఫీసులో నిలిపి ఉంచిన కారు అద్దాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.