తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అల్సర్.. ఏఐజీ ఆస్పత్రి వైద్యుల నిర్దారణ.. హెల్త్ చెకప్ రిపోర్టు విడుదల..

By Sumanth Kanukula  |  First Published Mar 12, 2023, 4:27 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ కేసీఆర్‌కు డాక్టర్స్ వైద్య పరీక్షలు నిర్వహించారు.


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ కేసీఆర్‌కు డాక్టర్స్ వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌కు ఎండోస్కోపి, సిటీ స్కాన్ నిర్వహించిన వైద్యులు.. ఆయనకు అల్సర్‌ ఉన్నట్టుగా నిర్దారించారు. సీఎం కేసీఆర్‌కు పొత్తి కడుపులో అసౌకర్యం ఏర్పడిందని తెలిపారు. కడుపు నొప్పితో సీఎం కేసీఆర్‌కు వచ్చారని చెప్పారు. ఎండోస్కోపి, సిటీ స్కాన్ చేసినట్టుగా వెల్లడించారు. 

‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈరోజు ఉదయం పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడింది. ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి కేసీఆర్‌ను పరీక్షించారు. ఆ తర్వాత ఆయనను ఏఐజీ ఆస్పత్రికి తీసుకురావడం జరిగింది. ఆస్పత్రిలో కేసీఆర్‌కు సీటీ, ఎండోస్కోపీ చేశారు. కడుపులో ఒక చిన్న అల్సర్క కనుగొనబడింది. అది మందులతో తగ్గిపోతుంది. ఆయన మిగిలిన అన్ని పారామిటర్స్ సాధారణంగా ఉన్నాయి. తగిన మెడికేషన్ ఇవ్వడం ప్రారంభించబడింది’’ అని ఏఐజీ ఆస్పత్రి పేర్కొంది. 

Latest Videos

ఇదిలా ఉంటే.. కేసీఆర్ ఎప్పుడూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారనే విషయాన్ని మాత్రం ఆస్పత్రి వర్గాలు వెల్లడించలేదు. మరోవైపు కేసీఆర్‌తో పాటు ఆస్పత్రిలో పలువురు కుటుంబ సభ్యులు, కొందరు మంత్రులు కూడా ఉన్నారు. 

click me!