పంజాగుట్టలో కలకలం.. షాప్ ఎదుట ఐదేళ్ల బాలిక మృతదేహం..

Published : Nov 04, 2021, 12:34 PM IST
పంజాగుట్టలో కలకలం.. షాప్ ఎదుట ఐదేళ్ల బాలిక మృతదేహం..

సారాంశం

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో (panjagutta) ఐదేళ్ల బాలిక మృతదేహం తీవ్ర కలకలం రేపింది. పంజాగుట్ట ద్వారకాపూరి కాలనీలో బాలిక మృతదేహాన్ని (girl dead body) స్థానికులు గుర్తించారు. 

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో (panjagutta) ఐదేళ్ల బాలిక మృతదేహం తీవ్ర కలకలం రేపింది. పంజాగుట్ట ద్వారకాపూరి కాలనీలో బాలిక మృతదేహాన్ని (girl dead body) స్థానికులు గుర్తించారు. ఓ షాపు ఎదుట బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలిస్తున్నారు. బాలికది ఎవరైనా హత్య ఇక్కడ పడేవేశారా..?, లేక సాధారణంగా మరణించిందా..?, అసలు బాలిక ఎవరు..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

బాలిక మృదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఆ పరిసరాల్లో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్