స్నేహితులతో విందు, అంతలోన్ గన్ మిస్ ఫైర్: సిద్దిపేట జిల్లాలో యువకుడి మృతి

Published : Nov 04, 2021, 10:08 AM ISTUpdated : Nov 04, 2021, 02:14 PM IST
స్నేహితులతో విందు, అంతలోన్ గన్ మిస్ ఫైర్: సిద్దిపేట జిల్లాలో యువకుడి మృతి

సారాంశం

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్‌పూర్ లో గన్ మిస్ ఫైర్ కావడంతో ముసాఫ్ ఖాన్ అనే వయక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని ముసాఫ్‌ఖాన్ గా గుర్తించారు.

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్‌పూర్‌లో :Gun మిస్ ఫైర్ కావడంతో ముసాఫ్ ఖాన్ అనే వ్యక్తి మృతి చెందాడు. Hyderabadకు చెందిన  ముసాఫ్ ఖాన్ సలాక్ పూర్ గ్రామానికి బుధవారం నాడు రాత్రి చేరుకొన్నాడు.

also read:సెక్రటేరియట్ టాయిలెట్ లో కాలుజారి పడి హౌస్ కీపింగ్ వ్యక్తి మృతి... ఆందోళన చేపట్టిన సిబ్బంది... (వీడియో)

Salakhpur లోని తన స్నేహితుడి ఇంట్లో మరో ఎనిమిది మందితో కలిస ముసాఫ్‌ఖాన్ విందులో పాల్గొన్నాడు. అయితే ఈ సందర్భంగా గన్ మిస్ ఫైర్ అయింది.ఈ  ఘటనలో ముసాఫ్‌ఖాన్ తలకు గాయమైంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముసాఫ్ ఖాన్ మరణించాడు.  

సలాక్‌పూర్ గ్రామంలోని సయ్యద్ మన్సూర్ కు చెందిన ఇంట్లో ప్రమాదవశాత్తు ఎయిర్ గన్ పేలిందని హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ చెప్పారు. మన్సూర్ అమెరికాలో నివాసం ఉంటున్నాడు. అయితే సెలవుపై ఆయన అమెరికా నుండి తన స్వగ్రామానికి వచ్చారని చెప్పారు.  

హైద్రాబాద్ నుండి  అతని స్నేహితులు ఏడుగురు కూడా ఆయనతో పాటు సలాక్‌పూర్ కు చేరుకొన్నారన్నారు. స్నేహితులంతా కలిసి బుశారం నాడు రాత్రి  విందు చేసుకొన్నారని చెప్పారు.ఈ విందు సమయంలో ఎయిర్ గన్ మిస్ ఫైర్ అయిందన్నారు. ఈ ఘటనలో ముసాక్ ఖాన్ తలకు గాయమైంది.. ఆయనను ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందినట్టుగా ఏసీపీ వివరించారు.విందులో పాల్గొన్న ఆరుగురిని అతుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని ఏసీపీ చెప్పారు.
 


 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu