
స్వచ్ఛ భారత్ అవగాహన ప్రచారంలో ముందున్న పట్టణాలు, నగరాల జాబితాను కేంద్రపట్టణాభివృద్ధి శాఖ ఈ రోజు విడుదల చేసింది. ఈ మేరకు జాబితాలో ఉన్న మొదటి పది స్థానాలను కేంద్రపట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది.
ఈ జాబితాలో అలీగఢ్ మొదటి స్థానంలో నిలువగా, హైదరాబాద్ మూడవ స్థానం, తిరుపతి 8వ స్థానంలో నిలిచాయి.
రెండో స్థానంలో వసాయ్-విరార్ (మహారాష్ట్ర), నాలుగో స్థానం-గురుగ్రామ్ (హర్యానా), ఐదో స్థానం-చండీగఢ్ (హర్యానా), ఆరోస్థానం-మధురై (తమిళనాడు), ఏడో స్థానం-వడోదర, రాజ్‌కోట్ (గుజరాత్), తొమ్మిదో స్థానం లో మైసూరు (కర్ణాటక) నిలిచాయి.
కాగా, గత ఫిబ్రవరిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెల్లడించిన ర్యాంకులో హైదరాబాద్ 19 వ స్థానంలో నిలిచింది. ఇప్పడు గణనీయంగా తన స్థానాన్ని మెరుగుపరుచుకొని మూడో స్థానానికి దూసుకరావడం గమనార్హం.