హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు:సీపీఎం అభ్యర్ధి నామినేషన్ తిరస్కరణ

Published : Oct 01, 2019, 05:48 PM ISTUpdated : Oct 01, 2019, 05:55 PM IST
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు:సీపీఎం అభ్యర్ధి నామినేషన్ తిరస్కరణ

సారాంశం

హుజూర్‌నగర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ ను తిరస్కరించారు. 

హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో  భాగంగా సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అదికారి తిరస్కరించారు. ఎన్నికల రిటర్నింగ్ అదికారిపై చర్యలు తీసుకోవాలని  సీపీఎం నేతలు, కార్యకర్తలు హుజూర్‌నగర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

ఎలాంటి తప్పులు లేకున్నా కూడ పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ ను తిరస్కరించారని సీపీఎం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నామినేషన్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 2014,2018 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి శేఖర్ రావు పోటీ చేశాడు. 

ఈ రెండు ఎన్నికల్లో  శేఖర్ రావు నామినేషన్లను సక్రమంగా ఉన్నట్టుగా అధికారులు గుర్తించిన విషయాన్ని సీపీఎం నేతలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.   ఫారం-26తో పాటు, కుల సర్టిఫికెట్ కు సంబంధించిన విషయమై పూర్తి అప్‌డేట్ లేదని రిటర్నింగ్ అధికారి సీపీఎం అభ్యర్ధి శేఖర్ రావు నామినేషన్ ను తిరస్కరించారు. 
 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu