సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. దసరా సెలవుల తర్వాత ఈ విషయమై ఇరుపక్షాల వాదనలను వింటామని కోర్టు ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు షాకిచ్చింది. మంగళవారం నాడు ఈ విషయమై చేపట్టిన పిటిషన్ పై హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. దసరా సెలవుల తర్వాత ఈ కేసు విషయమై పూర్తి వాదనలను వింటామని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.
తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై మంగళవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
undefined
సచివాలయ భవాన్ని కూల్చివేయవద్దని హైకోర్టు తేల్చి చెప్పింది.ఈ విషయమై స్టే విధించింది. అయితే సచివాలయం కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకొందని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయంగా ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అయితే ఈ సమయంలో భవనాల కూల్చివేతకు సంబంధించి స్టే విధిస్తున్నట్టుగా హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్ పై వాదనలను వింటామని కోర్టు తేల్చి చెప్పింది.
ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మాణంపై కూడ హైకోర్టు ప్రభుత్వానికి ఇటీవలే షాకిచ్చింది. ఎర్రమంజిల్ లో కోత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి హైకోర్టు నో చెప్పింది.
కేసీఆర్‌కు హైకోర్టు షాక్: ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మాణానికి హైకోర్టు నో ...