హుజురాబాద్ లో కూడా దుబ్బాక రిపీట్..? మరోసారి రోటి మేకర్ గుర్తు తెరాస కొంపముంచనుందా..?

By team telugu  |  First Published Nov 2, 2021, 10:27 AM IST

హుజురాబాద్ ఓట్ల లెక్కింపును (Huzurabad bypoll Result 2021) పరిశీలిస్తున్న వారికి ఓ విషయంలో ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే రోటీ మేకర్ గుర్తుపై పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్‌కు అనే అభ్యర్థికి 122 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌ను మించి రోటీ మేకర్ గుర్తుకు ఓట్లు రావడంతో ఇప్పుడు కొందరి దృష్టి అటు వైపు మళ్లింది. 


హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు (Huzurabad bypoll Result 2021) కొనసాగుతుంది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజ్‌లో అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అధికారులు.. ఆ తర్వాత రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో Trs కు ఆధిక్యం దక్కింది. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్‌ఎస్‌కు 503, Bjpకి 159, congrssకి 32 ఓట్లు దక్కాయి. అయితే 14 ఓట్లు చెల్లలేదు.  ఇదిలా ఉంటే మొదటి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అధిక్యం కనబరిచారు. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ కు 4444, బీజేపీకి 4610 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 119 ఓట్లకే పరిమితం అయింది. అయితే ఈ ఓట్ల లెక్కింపును పరిశీలిస్తున్న వారికి ఓ విషయంలో ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే రోటీ మేకర్ గుర్తుపై పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్‌కు అనే అభ్యర్థికి 122 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌ను మించి రోటీ మేకర్ గుర్తుకు ఓట్లు రావడంతో ఇప్పుడు కొందరి దృష్టి అటు వైపు మళ్లింది. 

ఈ క్రమంలోనే కొందరు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలను గుర్తుచేసుకుంటున్నారు. దుబ్బాక మాదిరిగానే రోటి మేకర్ గుర్తు మరోసారి టీఆర్‌ఎస్ కొంప ముంచననుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ ఫలితాలను గమనిస్తే ఇదే విషయం స్పష్టం అవుతుంది. అసలు దుబ్బాకలో ఏం జరిగిందంటే.. దుబ్బాక‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్తి రఘునందన్‌ రావు 1,118 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు చివరి రౌండ్ వరకు తీవ్ర ఉత్కంఠను రేపిన సంగతి తెలిసిందే. రోటి మేకర్ గుర్తు.. కారును గుర్తును పోలి ఉండటంతో కొందరు వృద్దులు ఆ గుర్తుకు ఓటు వేస్తున్నారని టీఆర్‌ఎస్ శ్రేణులు చెప్పాయి. 

Latest Videos

undefined

Also read: Huzurabad Bypoll Result 2021: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల.. లైవ్ అప్‌డేట్స్.. 

అయితే ఆ ఎన్నికలో రోటీ మేకర్ గుర్తు కీలక భూమిక పోషించింది. రోటి మేకర్ గుర్తుపై పోటీ చేసిన బండారు నాగరాజుకు 3,489 ఓట్లు వచ్చాయి. అంటే ఇది ఒక రకంగా టీఆర్‌ఎస్ విజయాన్ని దూరం చేసిందని ఆ పార్టీకి చెందిన నేతలు వ్యాఖ్యానించారు. మరి అదే విధంగా హుజురాబాద్‌లో రోటి మేకర్ గుర్తుకు ఓట్లు పోల్ కావడంతో.. దుబ్బాక సీన్ రిపీట్ అవుతుందేమోనని టీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

 

ఈటెల అక్రమాలకు పాల్పడ్డాడనే కారణంతో ఆయనపై సీఎం కేసీఆర్ విచారణ చేపట్టడం... ఆవెంటనే ఈటెల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం... ఆ తరువాత తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.  ఈ నేపథ్యంలో వచ్చిన ఉపఎన్నికల్లో తెరాస తరుఫు నుంచి విద్యార్ధి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా... బీజేపీ నుంచి ఈటెల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచాడు.

ఇక ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో అత్యధిక సర్వేలు బీజేపీ వైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే..! నాగన్న సర్వే మినహా మిగితా అన్ని సర్వేలు ఈటెల గెలుస్తాడని తెలిపాయి. ఇక్కడ జరిగిన ఎన్నిక తెరాస వర్సెస్ బీజేపీ గా కన్నా ఈటెల వర్సెస్ కేసీఆర్ గా జరిగాయి. పూర్తిగా పోలరైజ్డ్ గా సాగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం అత్యల్పంగా ఉండి ... డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితి కనబడడం లేదు. అయితే మరికొన్ని గంటల్లోనే హుజురాబాద్ విజేత ఎవరనేది తేలిపోనుంది. 

click me!