హుజురాబాద్‌‌లో టీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు.. సీనియర్ నేతల ఇలాకాలో చేదు అనుభవం..

By team teluguFirst Published Nov 2, 2021, 11:24 AM IST
Highlights

టీఆర్‌ఎస్ (TRS) ఆశలు పెట్టుకున్న పలుచోట్ల ఈటల అధిక్యం కనబరచడం టీఆర్‌ఎస్‌ శ్రేణులు షాక్‌కు గురవతున్నారు. huzurabad మున్సిపాలిటీలో కూడా బీజేపీ అధిక్యం కనబరచడంతో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. హుజురాబాద్‌లోనే బీజేపీ లీడ్ వచ్చిందంటే.. జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్‌లలో కూడా బీజేపీ లీడ్ పక్కా అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

హుజురాబాద్‌లో రౌండ్ల వారీ‌గా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన మూడు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అధిక్యం కనబరిచారు. మూడు రౌండ్ల తర్వాత ఈటల 1,273 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో బీజేపీ 13,525.. టీఆర్‌ఎస్‌ 12,252.. కాంగ్రెస్‌ 446 ఓట్లు సాధించాయి. అయితే టీఆర్‌ఎస్ ఆశలు పెట్టుకున్న పలుచోట్ల ఈటల అధిక్యం కనబరచడం టీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. హుజురాబాద్ మున్సిపాలిటీలో కూడా బీజేపీ అధిక్యం కనబరచడంతో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. హుజురాబాద్‌లోనే బీజేపీ లీడ్ వచ్చిందంటే.. జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్‌లలో కూడా బీజేపీ లీడ్ పక్కా అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సైలెంట్ ఓటింగ్ బీజేపీకి మళ్లిందని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీ ఓట్లు బీజేపీకి మళ్లినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. 

Also read: టీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన దళిత బంధు..! అక్కడ బీజేపీదే అధిక్యం.. కేసీఆర్ ప్లాన్ రివర్స్ కొట్టిందా..?

అంతేకాకుండా మంత్రులు, సీనియర్ నాయకులు ప్రచారం చేసిన చోట్ల మాత్రమే కాకుండా టీఆర్‌ఎస్ సీనియర్ నేతల ఇలాకాలో కూడా గట్టి షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు సొంత గ్రామం సింగాపురంలో టిఆర్ఎస్‌కు చేదు అనుభవమే మిగిలింది. సింగాపురం లో టీఆర్ఎస్‌పై బీజేపీ అధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు సీఎం కేసీఆర్‌ దళిత బంధు నిర్వహించిన శాలపల్లిలో కూడా టీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. అక్కడ కూడా ఈటల అధిక్యం కనబరిచారు. 

Also read: Huzurabad Bypoll Result 2021: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల.. లైవ్ అప్‌డేట్స్.. 

ఇక, ఈటెల అక్రమాలకు పాల్పడ్డాడనే కారణంతో ఆయనపై సీఎం కేసీఆర్ విచారణ చేపట్టడం... ఆవెంటనే ఈటెల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం... ఆ తరువాత తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.  ఈ నేపథ్యంలో వచ్చిన ఉపఎన్నికల్లో తెరాస తరుఫు నుంచి విద్యార్ధి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా... బీజేపీ నుంచి ఈటెల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచాడు.

Also read: హుజురాబాద్ లో కూడా దుబ్బాక రిపీట్..? మరోసారి రోటి మేకర్ గుర్తు తెరాస కొంపముంచనుందా..?

ఇక ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో అత్యధిక సర్వేలు బీజేపీ వైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే..! నాగన్న సర్వే మినహా మిగితా అన్ని సర్వేలు ఈటెల గెలుస్తాడని తెలిపాయి. ఇక్కడ జరిగిన ఎన్నిక తెరాస వర్సెస్ బీజేపీ గా కన్నా ఈటెల వర్సెస్ కేసీఆర్ గా జరిగాయి. పూర్తిగా పోలరైజ్డ్ గా సాగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం అత్యల్పంగా ఉండి ... డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితి కనబడడం లేదు. అయితే మరికొన్ని గంటల్లోనే హుజురాబాద్ విజేత ఎవరనేది తేలిపోనుంది. 

click me!